YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

భారత్ లో భారీ విద్యుత్ యంత్ర పరికరాల తయారీ ఫ్యాక్టరీ

భారత్ లో భారీ విద్యుత్ యంత్ర పరికరాల తయారీ ఫ్యాక్టరీ

చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ప్రతినిధి బృందం షాంఘై లో భారీ విద్యుత్ యంత్ర పరికరాలు తయారు చేసే వి. ఇ. ఎం కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనాదిగా చైనా భారత్ మద్య సత్సంబంధాలు కొనసాగినాయని, బౌద్ద ధర్మం భారత్ నుంచే చైనాకు అందిందని ఆయన గుర్తు చేసినారు. ఫాహియాన్, హువాన్ త్సాంగ్ లాంటి చైనా యాత్రికులు 2 వేల ఎండ్ల క్రితమే భారత్ నీ సందర్శించి అక్కడి విజ్ఞానాన్ని చైనాకు పరిచయం చేసినారనీ ఆయన అన్నారు. యూరప్ దేశాల్లో పారిశ్రామిక విప్లం ముగిసిందని, మన రెండు దేశాల్లో పారిశ్రామిక విప్లవం ఇప్పుడిప్పుడే మొదలయిందని , రెండు దేశాలు పరస్పర సహకారం తో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కృషిలో వి ఈ ఎం కూడా పాత్ర పోషించాలని భావిస్తున్నట్టు, భారత్ లో విద్యుత్ పరికరాల తయారీ యూనిట్ స్థాపించాలని యోచిస్తున్నట్టు హాంగ్ టావో అన్నారు. భారత్ లో యూనిట్ స్థాపించాలని అనుకుంటే అందుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైనది, తెలంగాణ ప్రభుత్వం మంచి పారిశ్రామిక విధానాన్ని ప్రవేశ పెట్టింద నీ వారికి సూచించారు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోరారు. జర్మనీలో ఉన్న తమ కంపెనీ యూనిట్ లని , వారి ఉత్పత్తులను పరిచయం చేస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తమ కంపెనీ జర్మనీలో 1886 స్థాపించబడిందని , 86 దేశాల్లో వివిధ ప్రాజెక్టులకు విద్యుత్ యంత్ర పరికరాలు సరఫరా చేస్తున్నామని వివరించారు. తమకు 0.06 కిలో వాట్ నుంచి 42 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన యంత్ర పరికరాలను తయారు చేసే సత్తా ఉందని, ఇంత కంటే భారీ యంత్రాలను కూడా తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. జర్మనీ లో 5 చోట్ల తమకు యంత్ర పరికరాల తయారీ యూనిట్లు ఉన్నాయి.అని, వీటిలో 1200 మంది ఇంజనీర్లు , టెక్నీషియన్లు పనిచేస్తున్నారని, తమ కంపెనీ తరపున విదేశాల్లో 300 మంది సాంకేతిక సేవలు అందిస్తున్నారని ఆయన వివరించారు. 200 మిలియన్ యూరోల వార్షిక టర్న్ ఓవర్ తమ కంపెనీకి ఉందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తిపోతల పథకాలను చేప ట్టిందని , వీటికి భారీ విద్యుత్ యంత్ర పరికరాలు అవసరమవుతాయ నీ సలహాదారు పెంటా రెడ్డి అన్నారు. వి ఈ ఎం కంపెనీ గురించి తమ ఏజెన్సీలకు సూచిస్తామని అన్నారు. అయితే భారత్ లో యూనిట్ స్థాపించడానికి ముందే ఇక్కడ ఒక సర్వీస్ సెంటర్ నీ ఏర్పాటు చేయాలని వారికి ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ , సలహాదారు పెంట రెడ్డి సూచించారు. వి ఈ ఎం కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ హాంగ్ టావో హె తెలంగాణ బృందానిక స్వాగతం పలికారు. ఈ సమావేశంలో తెలంగాణ తరపున ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, లిఫ్ట్ సలహాదారు పెంటారెడ్డి, సాగునీటి మంత్రి ఓ ఎస్ డి శ్రీధర్ రావు దేశ పాండే , జెంకొ ఇంజనీర్ వాసుదేవ్ , నవయుగ ప్రతినిధి మల్లినాత్ పాల్గొన్నారు.

Related Posts