కాణిపాకం ఆలయంలో భద్రత పటిష్టం
చిత్తూరు ఫిబ్రవరి 24,
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిఘా వ్యవస్థను ఆలయ ఈవో వెంకటేశు పటిష్టం చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల తోపాటు తమిళనాడు,కర్ణాటక మధ్యన కాణిపాకం పుణ్యక్షేత్రం ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.అలాగే దేశవిదేశాల నుండి భక్తులు వస్తుంటారు.ఆలయ భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఆలయ ఈవో ప్రత్యేక దృష్టి సారించారు.
ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాల దృశ్యాల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేశారు.ఈ సంద ర్భంగా ఈవో వెంకటేశు మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం ఆలయంలో నిఘా వ్యవస్థను పటిష్ట పరుస్తున్నా మని తెలిపారు. ఇందుకోసం 44 సీసీ కెమెరాలను ఆలయంతో పాటు నాలుగు మాడ వీధులు, ఆలయ అనుబంధ ఆలయమైన శివాలయం, వరదరాజుల స్వామి ఆలయం, వాహన పూజ, వినాయక సదన్ గణేష్ సాదన్, బస్టాండు ప్రాంతాల్లో అమర్చడం జరిగిందన్నారు. అలాగే రథం మండపం వద్ద హోం గార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పర్యవేక్షించేందుకు మూడు షిఫ్టులుగా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.