YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

చంద్రన్న క్రాంతి పథకంతో గ్రామల్లో వెలుగులు : మంత్రి లోకేష్

చంద్రన్న క్రాంతి పథకంతో గ్రామల్లో వెలుగులు :  మంత్రి లోకేష్

రాష్ట్రంలో పెన్షన్లు రెండు వందల రూపాయల నుంచి 1000 రూపాయలకు పైగా పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వనిదే. 4900 అంగన్వాడి భవనాలు ఏర్పాటు చేసాం. 12918 గ్రామ పంచాయతీ లో ఇంటి ఇంటికి రెండు చెత్త బుట్టలు ఇచ్చి తడి చెత్త పొడి చెత్త గా పొగుచేసి డంప్ యార్డ్ కి తరిలిస్తామని మంత్రి నారా లోకేష్ బాబు అన్నారు. మంగళవారం నాడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం కార్యక్రమానికి అయన మాజరయ్యారు. ఈ సందర్బండడా అయన ద్వారంపూడి లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమానికి హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప ,ఎంపీ మురళీమోహన్ ఇతర నేతలు హాజరయ్యారు. ద్వారంపూడి లో మంత్రి లోకేష్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పేరు చెప్పగానే పచ్చని పోలాలు, తాపేశ్వరం కాజా అందరికీ గుర్తుకోస్తాయి.కానీ నాకు ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు గుర్తుకోస్తాయి. పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడుకి సేవ చేసినట్టే అని పెద్దలు చెప్పే వారు. అతి చిన్న వయస్సులో గ్రామాలకు సేవ చేసే అదృష్టం నాకు వచ్చిందని అన్నారు. నేను మంత్రి గా బాధ్యతలు తీసుకొని సంవత్సరం అయ్యింది.ఈ 12 నెలల్లో శాఖ పరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాం. పంచాయతీ రాజ్ దినోత్సవం మీ అందరి మధ్యలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్ర పరిస్థితి ఎంటో ఒక సారి గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర విభజన సమయంలో ఆదాయం ఒక రాష్ట్రానికి ఇచ్చి అప్పులు మన నెత్తి పై పెట్టారు. రాజధాని లేదు,నిధులు లేవు అలాంటి పరిస్థితిలో మనం ప్రయాణం మొదలు పెట్టామని గుర్తు చేసారు. ఎన్ని కష్టాలు ఉన్నా మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి అని ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, తూర్పుగోదావరి జిల్లా లొ వంద శాతం ఏల్ ఈడీ బల్బు లతో వీధి దీపాలు అమర్చామని అన్నారు. చంద్రన్న క్రాంతి పథకం క్రింద గ్రామ గ్రామంలో వెలుగులు నింపడం టీడీపీ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. 64 సంవత్సరా ల వయస్సు వున్న ముఖ్యమంత్రి వేగాన్ని అందుకోవడం చాలా కష్టం వుందని అయన అన్నారు.

Related Posts