YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మరో ప్రయోగానికి ఇస్రో సిద్దం

మరో ప్రయోగానికి ఇస్రో సిద్దం

మరో ప్రయోగానికి ఇస్రో సిద్దం
నెల్లూరు ఫిబ్రవరి 25
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది. పూర్తి స్థాయి వాణిజ్జ ఒప్పందాలతో పీఎస్ ఎల్వీ- సీ 51 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా లోని శ్రీహరికోట రాకెట్  ప్రయోగ కేంద్రం నుండి ఈ ప్రయోగం జరుగుతుంది.వరుస విజయాలతో ముందుకు పోతున్న ఇస్రో ఇప్పుడు మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది.  సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఈ నెల 28 వ తేదీ ఉందయం 10 :24 నిమిషాలకు  సీఎస్ఎల్వీ సీ 51 రాకెట్ ద్వారా 19 ఉపగ్రహాలను ప్రయోగించనున్నది . ఇది పూర్తిగా ఇస్రో వాణిజ్య  ఒప్పందాలతో  ప్రయోగిస్తున్న మొదటి రాకెట్ ప్రయోగం. భారత్ కు చెందిన వివిధ కళాశాలలకు  చెందిన 5 ఉపగ్రహాలు,అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలతో పాటు బ్రెజిల్ కు చెందిన మరో  ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఇవన్నీ ప్రవేటు సంస్థల ప్రయోజనాలకోసం వాణిజ్య పరంగా  ప్రయోగించే ఉపగ్రహాలు. ఈ ప్రయోగం లో ప్రధానముగా బ్రెజిల్ కు చెందిన అమోజోనియా -1  మిషన్ అనే ఉపగ్రహం ఉంది.దీని బరువు 637 కిలోలు. ఇది 4 సంవత్సరాల పాటు  పని చేస్తుంది.దీంతో  పాటుగా సతీష్ ధావన్ శాట్, యూనిటీ శాట్ లు మూడు , సిందునేత్ర అనే  ఉపగ్రహాల తో పాటు అమెరికా కు చెందిన సాల్ -1 నానో కనెక్ట్-2 ఉపగ్రహం మరో 12  బీఈఈఎస్ ఉపపగ్రహాలను కూడా ఇస్రో ఒకే రాకెట్ ద్వారా ప్రయోగిస్తోంది.  ప్రయోగం  తరువాత మొదటి  17 నిమిషాల తరువాత బ్రెజిల్ కు చెందిన ఆమెజోనియా ఉపగ్రహాన్ని  కక్షలోకి వదులుతుంది. తరువాత గంటా 55 నిమిషాల పాటు ప్రయాణం చేసి మిగిలిన 18 ఉపగ్రహాలను కక్షలో నిలపడం జరుగుతుంది. పీఎస్ ఎల్వీ సీ-51 1 ఇస్రో చరిత్రలో 53 రాకెట్ ఇప్పటి దాకా షార్ నుండి ఇస్రో 78 రాకెట్  ప్రయోగాలను చేపట్టింది. , అలాగే ఇప్పటి దాకా ఇస్రో 34 దేశాలకు సంబందించిన 342 ఉపగ్రహాలను  వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రయోగించింది. 

Related Posts