తుగ్గలి ప్రాథమిక వైద్యశాలలో ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్
తుగ్గలి ఫిబ్రవరి 25
మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక ప్రాథమిక వైద్యశాల యందు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ను అధికారులు ప్రారంభించారు.బుధవారం రోజున తుగ్గలి పి.హెచ్.సి నందు మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు డాక్టర్ ద్రాక్షయని ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ తుగ్గలి ప్రాథమిక వైద్యశాల సిబ్బంది కు,ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మరియు హెల్త్ వర్కర్స్ లకు దాదాపుగా మొదటి మరియు రెండవ విడత వ్యాక్సినేషన్ డోసులు పూర్తి అయ్యాయని, బుధవారం రోజున ఆశా కార్యకర్తలకు వ్యాక్సిన్ అందించి,గంటపాటు వైద్యశాల యందు పర్యవేక్షణలో ఉంచామని మెడికల్ ఆఫీసర్లు ప్రవీణ్ కుమార్,ద్రాక్షయని లు తెలియజేశారు. ఫ్రంట్లైన్ వారియర్స్,హెల్త్ వర్కర్లు తప్పకుండా మొదటి మరియు రెండవ విడతల వ్యాక్సినేషన్ ను తప్పకుండా వేయించుకోవాలని వారు తెలియజేశారు.కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా పోలీసు అధికారులకు మొదటి విడత కోవిడ్ వాక్సిన్ డోసును అందజేస్తామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ప్రవీణ్ కుమార్,డాక్టర్ ద్రాక్షయని, ఆశా కార్యకర్తలు షకీనాబి,నాగమణి, ప్రాథమిక వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.