YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చేపకు ఈత -  వెల్లంపల్లికి అవినీతి ఒకరు నేర్పాల్సినపనిలేదు

చేపకు ఈత -  వెల్లంపల్లికి అవినీతి ఒకరు నేర్పాల్సినపనిలేదు

చేపకు ఈత -  వెల్లంపల్లికి అవినీతి ఒకరు నేర్పాల్సినపనిలేదు
విజయవాడ  ఫిబ్రవరి 25

రాష్ట్రంలో రెండోఅతిపెద్ద దేవాలయమైన కనకదుర్గమ దేవాలయంలో ఏసీబీ జరిపినసోదాల్లో అనేకఅక్రమాలు వెలుగులోకి వచ్చాయని, వాటిని సాకుగాచూపి, 12మంది చిరుఉద్యోగులను జైలుకుపంపేందుకుసిద్ధమయ్యారని టీడీపీ అధికారప్రతినిధి నాగుల్ మీరా తెలిపారు. దుర్గగుడిలో జరిగిన అవినీతి, అక్రమాలకు నైతికబాధ్యతవహిస్తూ వెల్లంపల్లి శ్రీనివాస్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతికబాధ్యత ఉన్నా కూడా వెల్లంపల్లిపై తక్షణమే చర్యలుతీసుకొని ఆయన్ని జైలుక పంపాలన్నారు. దేవాలయాలనుఅవినీతి కేంద్రాలుగా మారిస్తే, ఆ ప్రభావం హిందువుల మనోభావాలపై పడదా అనేవిషయాన్ని ముఖ్యమంత్రి ఎందుకువిస్మరిస్తున్నాడని నాగుల్ మీరా ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 150కుపైగా దేవాలయాలపై దాడుల జరిగితే, అందుకు కారకులైనవారిని పట్టుకోలేని అసమర్థ మంత్రిగా వెల్లంపల్లి నిలిచాడన్నారు. చేపకు ఎవరూ ఈతనేర్పాల్సిన పనిలేదన్న నాగుల్ మీరా, వెల్లంపల్లికి అవినీతి చేయడం గురించి ఎవరూ చెప్పాల్సిన పనిలేదన్నారు. రాజకీయరంగులు మార్చడం, పార్టీలు మారడంలో వెల్లంపల్లిని మించినవారు రాష్ట్రంలోఎవరూ ఉండరన్నారు. ఉదయం వైసీపీ, మధ్యాహ్నం బీజేపీ, సాయంత్రం టీడీపీ కార్యాలయాలచుట్టూ తిరుగుతూంటాడన్నారు. అవినీతిపర డు, పెద్దదొంగ అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబునాయుడిపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. మహారాజుల వంశానికి చెంది అశోక్ గజపతిరాజును గురించి వెల్లంపల్లి చేసినవ్యాఖ్యలు క్షమించ రానివన్నారు. జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి వంటి అనేకమంది వెధవ లకు మంత్రిపదవులిచ్చాడని నాగుల్ మీరా మండిపడ్డారు. వారి వారి శాఖల్లో ఏంజరుగుతుందోతెలుసుకోలేని దద్దమ్మ మంత్రులం తా, పనిగట్టుకొని టీడీపీపై విమర్శలుచేయడమే పనిగా పెట్టుకు న్నారన్నారు. రాష్ట్రచరిత్రలో ఎన్నడూలేనివిధంగా ఏసీబీ తనిఖీల్లో అమ్మవారి దేవాలయంలో జరిగిన అవినీతివ్యవహారం బట్టబయలై నా స్వామీజీలుఎందుకు నోరుమెదపడంలేదని టీడీపీ నేత ప్రశ్నిం చారు. కనకదుర్గ అమ్మవారి గుడికి ఎదురుగా వెల్లంపల్లి నివాసం ఉంటుందన్నారు. అక్కడ జరిగే వ్యవహారాలు తనకు తెలియనట్లు ఆయన నటించినా నమ్మేవారు ఎవరూలేరన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖదేవాలయాల్లో ఏసీబీ విభాగంవారు తనిఖీలు జరపాలని, అప్పుడే వెల్లంపల్లి అవినీతి ఏస్థాయిలో ఉందో రాష్ట్ర ప్రజలకు తెలస్తుందన్నారు. దేవాలయాల పవిత్రతను కాపాడి, భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిపైనా ఉందన్నారు. అన్నివర్గాల భక్తులమనోభావాల ను కాపాడిన ఘనత చంద్రబాబునాయుడిదేనని, జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో జరిగే వ్యవహారాలపై దృష్టిపెట్టి, అవినీతిపరులను శిక్షించాలని నాగుల్ మీరా సూచించారు.

Related Posts