నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు కీలకం
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
వేములవాడ
నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు చాలా కీలకంగా పనిచేస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారుబుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలఠాణ గ్రామంలో బుధవారం 50 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ,డీఎస్పీ చంద్రకాంత్ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపిటిసి లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ నేరాలను అదుపు చేయడం, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పని చేస్తుందని అందువల్ల సిసి కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు. జిల్లా పోలీస్ స్టేషన్ ల పరిధిలో అన్ని గ్రామాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ గ్రామంలో నేను సైతం మరియు కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా 50 సీసీ కెమెరాలను ఏర్పాటు జరిగిందన్నారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ ప్రజలకు అభినందించారు. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణంసాధ్యమని ఆయన చెప్పారు. అనంతరం గ్రామ పంచా యతీ ఆవరణంలో జిల్లా ఎస్పీ మొక్కలు నాటారు . ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్,వేములవాడ టౌన్ సీఐ వెంకటేష్ ,సర్పంచ్ రేగులపాటి రాణి, ఎంపీటీసీ రేగులపాటి రవిచంద్ర రావు,ఉప సర్పంచ్ నాయిని రమ్య,వార్డు సభ్యులు శేఖర్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.