ఆంధ్ర ప్రదేశ్
వాతావరణంలో ఏర్పడ్డ మార్పుల కారణంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో తిరుమలకు వస్తున్న భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్వామి వారి ఆలయం పరిసర ప్రాంతాల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదు. ప్రతి నిత్యం స్వామి వారు ఆలయం చుట్టూ తిరుగుతుంటారు కనుక. దీంతో స్వామి వారి ఆలయంలోకి వెళ్ళిన భక్తులు, ఆలయం బయట ప్రాంతాల్లో తిరిగే భక్తులు ఎక్కువగా ఎండ తీవ్రతకు అల్లాడి పోతున్నారు. మరోవైపు అలిపిరి చెక్ పాయింట్లోనూ అదే పరిస్థితి. వాహనాల నుండి వచ్చే కాలుష్యంతో మరింతగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదుతున్నా సిబ్బంది విధుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని చెక్ పాయింట్ నిర్వహణ చేస్తున్నామని అధికారులు అంటున్నారు
తిరుమలలో విపరీతంగా ఉష్ణోగ్రతలు,క్యూలైన్లు కంపార్టుమెంట్లలో అల్లాడిపోతున్న భక్తులు, అలిపిరి చెక్ పాయింట్లోనూ విపరీతంగా ఉష్టోగ్రతలు.