YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అనుకున్నంతా వీజీయేం కాదు

అనుకున్నంతా వీజీయేం కాదు

హైదరాబాద్, ఫిబ్రవరి 25, 
తెలంగాణలో బీజేపీ దూకుడు మీద ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడంతో మంచి ఊపు మీదున్నారు. గోల్కోండ కోట మీద జెండా ఎగురవేయడం ఖాయమని జబ్బలు చరుస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ఖుషీని ఇంకా బీజేపీ నేతలు ఆస్వాదిస్తూనే ఉన్నారు. కానీ ముందు ముందు ఆ ఆనందం నిలిచే అవకాశాలు ఏమాత్రం కన్పించడం లేదు.త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగబోతోంది. అక్కడ బీజేపీ గెలుపు కష్టసాధ్యమే. గెలుపు కాదు కదా? కనీసం డిపాజిట్ దక్కించుకోవడమూ గగనమేనంటున్నారు. ఇంతవరకూ ఆ పార్టీ అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. తొలుత జానారెడ్డి కుటుంబానికి బీజేపీ గేలం వేసింది. అయితే జానారెడ్డి కుటుంబం కాంగ్రెస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకోవడంతో అక్కడ సరైన అభ్యర్ధి దొరకక బీజేపీ కిందా మీదా పడుతుంది.తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి రామచంద్రరావును అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో తిరిగి ఆయనకే టిక్కెట్ ఇచ్చింది. అయితే ఈసారి రామచంద్రరావు గెలుపు అంత సులువు కాదు. ఇక్కడి నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీగా రామచంద్రరావుకు గెలుపు అంత సులువు కాదు. ఈ స్థానంలో బీజేపీ ఆశలు వదులుకున్నట్లే.ఇక నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ లో ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీ గెలుపు అంత ఈజీకాదు. ఈ నియోజకవర్గంలో ప్రొఫెసర్ కోదండరామ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మూడు జిల్లాల్లో బీజేపీ బలం అంతంత మాత్రమే కావడంతో ఇక్కడ కూడా గెలుపు పిలుపు వినిపించదు. సో త్వరలో జరిగే మూడు ఎన్నికల్లో బీజేపీకి విజయావకాశాలు లేనట్లే చెప్పుకోవాలి.

Related Posts