హైద్రాబాద్, ఫిబ్రవరి 25,
నగరంలో వరద కాలువలు (నాలాలు) ఆక్రమణలతో కుంగిపోతుండటంతో ఏటా ముంపు సమస్య తలెత్తుతోంది. వీటిని విస్తరించి ముంపు సమస్యకు శాస్వత పరిష్కారం చూపాలని కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ సూచించింది.కాని ఆ నివేధిక అమలు మాత్రం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనకకు అన్నట్లు సాగుతూ దాదాపు అటెకెక్కింది. దీన్ని కొంతమేరకైనా నివారించాలంటే వచ్చే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎండాకాలమే పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, మరమ్మ తులు, నాలాల పూడిక పనులు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, రోడ్ల విస్తరణ పనుల పురోగతిని పరిశీలించారు.దబీర్ పురా నాలా, గంగానగర్ నాలా, మాతాకి కిడికి నాలాలలో పూడిక పనులు, రీటైనింగ్ వాల్స్ నిర్మాణం, యూకత్‌పుర రైల్వేస్టేషన్ నాలాలను పరిశీలించారు. కాగా గ్రేటర్ పరిదిలో 390 కి.మీ పొడవున నాలాలు విస్తరించి ఉన్నాయి. వాటిలో 58 కి.మీ పొడవు మేర ఉన్న ఆక్రమణలు తొలగించి విస్తరణ పనులు చేపట్టేందుకు రూ.28 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు.అయితే ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని నియమించి అత్యవసరంగా చేపట్టే పనులపై నివేధికను తయారు చేయించగా, కీలకమైన 58 కి.మీ పొడవున చేపట్టాలని సూచించటంతో అంచనా వ్యయం 12 వేలకోట్లకు తగ్గింది. దాంతో విడతల వారిగా చేపట్టేందుకు ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అనుమతి ఇచ్చింది. దాంతో 47 చోట్ల కుదించుకు పోయి బాటిల్ నెక్‌గా మారిన15.9 కి.మీ పొడవు నాలాల విస్తరణకు రూ.230 కోట్లతో తొలివిడత పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.వాటిలో 40 పనులు ప్రారంభమయ్యాయి. వాటిలో 18 చోట్ల పనులు నత్తనడకన సాగుతుండగా, తొమ్మది చోట్ల నిలిచిపోయాయి. మరో ఆరు చోట్ల చేపట్టాల్సిన పనులు టెండర్ దశలో ఉన్నాయి. వీటికోసం భూసేకరణ పూర్తి కాకపోవటంతో పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. నాలాల్లో ఉన్న నిర్మాణాల్లో మొత్తం 784 నిర్మాలుండగా కేవలం 184 మాత్రమే తొలగించగలిగారంటే భూ సేకరణలో ఎంత జాప్యం జరుగుతుందో తెలుస్తోంది.అంటే మరో 500 నిర్మాణాలు తొలగించాల్సి ఉంది. మరో 37 నాలాల్లో పూడిక పనులు చేపట్టాల్సి ఉండగా 9 పనులకు మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. మరో 18 పనులకు టెండర్ పిలిచినా వచ్చేవారు కరువవటంతో ఖరారు కావటంలేదు. ఇప్పుడున్న ధరలు గిట్టుబాటు కావటం లేదనే కారణంతోనే కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనటం లేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించి నగరాన్ని ముంపు నుంచి కాపాడ్సిన అవసరం ఎంతైనా ఉంది.