ఓమ్ అకార ఉకార మకారాల సమ్మేళనం ఓమ్ కారం. ఓమ్ ఉచ్చారణ తర్వాత వినిపించే శబ్దం అర్థమాత్ర ఇది ఇందులోనే ఉంది. ఈ అర్థమాత్రను ఏకాగ్రత ద్వారా వినవచ్చు. సృష్టికి మొట్టమొదట వినిపించిన శబ్దం ‘ఓమ్’ మాత్రమే. సృష్టికి ముందు తర్వాత ఉండేది శాశ్వతమైందీ ఈ ఏకాక్షర ఓమ్ కారమే. చతుర్ముఖ బ్రహ్మ ఈ ఓమ్‌కార జపం తోనే ఋగ్వేద, యజుర్వేద సామవేదాలను గ్రహించాడు. ఓమ్ కారం సర్వశ్రేష్ఠం. సర్వోన్నతం. ఓం కారం పదేపదే జపించడం ద్వారా ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. కార్బన్‌డైఆక్సైడ్ శాతం తగ్గుతుంది. సంపూర్ణ ఆరోగ్యానికి మంచి మందు ‘ఓమ్’కారం.
శ్రీమ్
పరమేశ్వరోపాసన చేసే వారు ఓం అని ఉచ్చరిస్తూ ఉంటే అమ్మవారి మంత్రోపాసన చేసేవారు శ్రీం అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. శ ర ఈ అనే మూడక్షరాల కలయిక శ్రీకారం. మహాలక్ష్మీ స్వరూపం. ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తుల ప్రతీక శ్రీకారం. ‘శ’, ‘ర’, ‘ఈం’ కారాలను కలిపితే శ్రీం ఇది జగన్మాత బీజాక్షరం. శ్రీం అంటే శ్రీవిద్యాబీజం. ‘శ్రీం’లో ‘శ, ర, ఈ’లతో పాటుగా పూర్ణానుస్వారం ఉంది. ర అంటే ధనం, ఈ అంటే తుష్టీనాద, పర, రం దుఃఖం దూరమగుట అని అర్థాలున్నాయి.
"ఆన్ని మంత్రాలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం;'. దినినే ప్రణవమని అంటారు. మంత్రోచారణం జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. సనాతనమైన హిందూ ధర్మమునందు ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. సర్వశ్రేష్ఠుడైన భగవంతునికి ఆకార రూ పం(నామ) నాదరూపం ఓంకారము. ప్రణవ నాద ము, ప్రధమ నామము, ఏకాక్షరమైన ఓంకారము. ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకార ము నుంచే యావత్తు జగము ఉద్భవించింది.వేదముల యొక్క సారము ఓంకారము. ఓం' అంటే ప్రారంభాన్ని తెలుపునది కూడా. ఓకాక్షర మంత్రము, భగవంతుని ముఖ్యనామమైన ఓం'కు అనేక అర్థాలు కలవని రుషులు తెలియజేశారు. బ్రహ్మనాదము ఓంకారము. ఆత్మ ఓంకార మంత్ర స్వరూపము ప్రణవ నాదమే ప్రాణము. ప్రధమ నాదము ఓంకారము. అకార, ఉకార, మకారములను మూడు అక్షరముల కలయిక వలన ఓంకారము ఉద్భవించినది.
ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి.
అందులో అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు. శబ్దమే భగవంతుడని చెప్పబడింది. ప్రతిపదమునకు మూలాధారము గా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది. శబ్దోచ్చారణలో మనం కంఠంలోని స్వరపేటికను,అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము. ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా? ఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.ఇందులో అ,ఉ,మ లు ఉన్నాయి. నాలుకలోని, అంగిలిలోని ఏ భాగము కూడా ‘అ ‘కార ఉచ్చారణ కు తోడ్పడదు. ఇది ఓంకారానికి బీజం గా ఉంది .చివరిది ‘మ ‘కారము.పెదవులని మూసి దీన్ని ఉచ్చరిస్తారు . నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయములో దొర్లుకుంటూ ఉంటుంది.ఇలా శబ్ద ఉచ్చారణా ప్రక్రియనంతా " ఓం " కారం తెలియజేస్తూంది. అందువలన " ఓం " కారాన్ని స్వీకరించడము జరిగింది.
ఓం నమో నారాయణాయ
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో