YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

రైతులకు ఆదుకుంటాం : సీఎం చంద్రబాబు

 రైతులకు ఆదుకుంటాం : సీఎం చంద్రబాబు
అక్టోబర్ 2 నాటికి 27లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నాడు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో నూటికి నూరు శాతం ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేశామన్నారు. వందశాతం ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటుకు పని చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. ఎల్ఈడీ బల్బులతో విద్యుత్ ఆదా అవుతుందని, అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ బల్బులు అమర్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ప్రతి పత్తి పాలన సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వాలు బలం వుంటే కేంద్ర ప్రభుత్వలు బలంగా వుంటాయి, పాదయాత్ర సమయంలో గ్రామ గ్రామాలు తిరిగాను అప్పుడు ప్రతి గ్రామంలో చెత్త చెదారం కనిపించేది, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4300 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు కట్టిచాము. గ్రామంలో ఉన్న చెత్తను, పశువుల పేడని పొగుచేసి ,ఎరువుల క్రింద మార్చి రైతులకు విక్రస్తాం. చెత్త నుండి ఆదాయాన్ని సమకూరుస్తం. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ ప్రభుత్వం ఒకటే రాష్ట్రని అభివృద్ధి చేస్తుంది అని నమ్మి ప్రజలు టీడీపీకి అధికారం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞత తెలియజేశారు. చంద్రన్న భీమా ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు 75 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ప్రతి సోమవారం వ్యసాయం లో యాంత్రికరణం అమలు చేస్తున్నాం. దీని ద్వారా రైతులకు ఖర్చులు తగ్గించి. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటాంమని ముఖ్యమంత్రి అన్నారు.

Related Posts