YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం విదేశీయం

అమెరికాలో గ్రీన్ కార్డుల దరఖాస్తులపై నిషేధం ఎత్తివేత

అమెరికాలో గ్రీన్ కార్డుల దరఖాస్తులపై నిషేధం ఎత్తివేత

అమెరికాలో గ్రీన్ కార్డుల దరఖాస్తులపై నిషేధం ఎత్తివేత
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 25
భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడంతో అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయులకు ఊరట కలిగిస్తున్నాయి. గత కరోనా టైంలో ట్రంప్ గ్రీన్ కార్డుల దరఖాస్తులపై నిషేధం విధించారు. దీంతో చాలామంది భారతీయులు గ్రీన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోలేకపోయారు. తాజాగా జో బైడెన్ ఈ నిషేధాన్ని ఎత్తేశారు. గ్రీన్ కార్డు అప్లికేషన్స్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. అమెరికాలో నివసిస్తున్న చాలామంది విదేశీయులు గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తుంటారు. ఎందుకంటే గ్రీన్ కార్డు వస్తే అమెరికాలో శాశ్వత నివాసం ఉండే అవకాశం ఉంటుంది. అమెరికా పౌరసత్వం వస్తుంది. తద్వారా అక్కడి ప్రభుత్వం అందజేసే లబ్ధిని పొందే అవకాశం ఉంటుంది. దీంతో చాలా మంది గ్రీన్ కార్డు ల కోసం వేచిచూస్తుంటారు. కరోనా టైం లో విదేశీయులు గ్రీన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకోకుండా ట్రంప్ నిషేధం విధించారు. అప్పట్లో ఆయన ఓ అధికారికి ఉత్తర్వు జారీ చేశారు.తాజాగా జో బైడెన్ ఆ  నిషేధాన్ని ఎత్తేశారు. దీంతో అమెరికా లో ఉన్న భారతీయులు ఇతర దేశాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గత ప్రెసిడెంట్ డొనాల్డ్  ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికాలో బతుకుతున్న విదేశీయులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అమెరికన్ ఫస్ట్ అనే నినాదంతో అధికారం చేపట్టిన ట్రంప్ అదే ఆలోచనలతో సంచలన నిర్ణయాలు తీసుకునేవారు. దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఇతర దేశస్తులు సైతం ఇక్కట్లు ఎదుర్కొనేవారు. అయితే ఇటీవల అమెరికాలో అధికార మార్పిడి జరిగిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు ట్రంప్ ఓడిపోయి.. డెమోక్రాట్ల తరఫు అభ్యర్థి జో బైడెన్ పగ్గాలు చేపట్టారు.
 

Related Posts