YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆ స్థలాన్ని పేదలకు కేటాయించండి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు సిఎం జగన్ లేఖ

ఆ స్థలాన్ని పేదలకు కేటాయించండి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు సిఎం జగన్ లేఖ

ఆ స్థలాన్ని పేదలకు కేటాయించండి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు సిఎం జగన్ లేఖ
అమరావతి ఫిబ్రవరి 25
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజరాజేశ్వరి పేటకు సంబంధించిన 800 కుటుంబాలు రైల్వేకు చెందిన స్థలాల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని 30 ఏళ్లుగా నివసిస్తోన్నాయి. తమ స్థలాలను క్రమబద్దీకరించాలంటూ ఇదివరకు ఆ కుటుంబాల వారు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఙప్తి చేశారు.దీనితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. ఓ కీలక ప్రతిపాదనను ఆయన ముందుంచారు సీఎం జగన్ . దీనికి ఆయన అంగీకరిస్తే.. విజయవాడలో నివసిస్తోన్న పలువురు పేద కుటుంబాలకు లబ్ది కలుగుతుంది. వారు ఇప్పుడు నివసించే ప్రదేశంలోనే శాశ్వతంగా కొనసాగే అవకాశాలు ఉంటాయి. వైఎస్ జగన్ చేసిన ఈ ప్రతిపాదనకు రైల్వేమంత్రి గానీ ఆ మంత్రిత్వ శాఖ అధికారులు గానీ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా ఉంది.వినతిపత్రాలను అందజేశారు. అవేవీ ఫలించలేదు. రైల్వేకు సంబంధించిన స్థలం కావడం వల్ల.. దాన్ని క్రమబద్దీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దీన్ని పరిష్కరించడానికి వైఎస్ జగన్ చొరవ తీసుకున్నారు.   రైల్వే శాఖకు ఉపయోగంలో లేని ఈ భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.  దానికి బదులుగా అజీజ్ పేటలోని 25 ఎకరాల భూమిని రైల్వే శాఖకు బదిలీ చేస్తామని లేఖలో జగన్ పేర్కొన్నారు.  మరి ఈ లేఖపై కేంద్ర రైల్వేశాఖ ఎలా స్పందిస్తుందో చేసి చూడాలి.

Related Posts