రాజన్న సిరిసిల్ల
నేరాల నియంత్రణతోపాటు, కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడుతాయని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కల్లు దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాల సహాయంతో ఇప్పటికే పలు నేరాలను ఛేదించామని తెలిపారు. వీటిద్వారా చోరీలు, స్నాచింగ్ వంటి నేరాలను అరికట్టవచ్చని, ఇలాంటి దొంగతనాలకు పాల్పడేవారు దొరికిపోతామని భయపడుతున్నారని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు పది కల్లు దుకాణాల్లో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.