YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

కాట్ప యాక్ట్ రద్దు చేయాలని కదిలిన మహిళా బీడీ కార్మిక లోకం 

కాట్ప యాక్ట్ రద్దు చేయాలని కదిలిన మహిళా బీడీ కార్మిక లోకం 

కాట్ప యాక్ట్ రద్దు చేయాలని కదిలిన మహిళా బీడీ కార్మిక లోకం 
కామారెడ్డి ఫిబ్రవరి 25
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి జిల్లా కలెక్టర్ ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభా కార్యక్రమానికి సుమారు ఐదు వేలకు పైగా మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు. బి ఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ రెడ్డి, బి ఎం ఎస్  రాష్ట్ర  సంఘటన కార్యదర్శి పెద్ది శివయ్య లు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలోని 17 రాష్ట్రాలలో 4 కోట్ల 50 లక్షలమంది బీడీ కార్మికులు ఉన్నారని వీరు బీడీ పరిశ్రమలో పని చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి కోట్ప యాక్ట్ నుండి బీడీ పరిశ్రమను మినహాయించాలని డిమాండ్ చేశారు.   బీడీ పరిశ్రమలో మహిళా కార్మికులు చేతి వృత్తి తో జీవనం కోనసాగిస్తున్నారని తెలిపారు,సిగరెట్, గుట్కా, తంబాకు, మొదలగు పరిశ్రమల్లో మొత్తం ఐదు వేల మంది కార్మికులు పని చేస్తుండగా ఒక బీడీ పరిశ్రమలలో 4 కోట్ల 50 లక్షల మంది బీడీ కార్మికులు ఉపాధి కొనసాగిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కాట్ప యాక్ట్ నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు అన్ని రాష్ట్రాల్లో  కోట్ప యాక్ట్ నుండి బీడీ పరిశ్రమను మినహాయించాలని  డిమాండ్ చేసారు.  సభానంతరం జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఎం ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్,  జిల్లా కార్యదర్శి లచ్చయ్య, జిల్లా కన్వీనర్ చంద్రమౌళి,  మేదరి ప్రసాద్,  సాయిలు, నర్సింలు,  దామోదర్ రెడ్డి, శ్రీనివాస్, లతోపాటు బీడీ కార్మికులు  మహిళలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
=======================

Related Posts