YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రులపై వేటుకు వేళాయెరా

మంత్రులపై వేటుకు వేళాయెరా

విజయవాడ, ఫిబ్రవరి 26, 
కాగల కార్యం గంధర్వులు తేలుస్తారు అన్నది ఒక పాత సామెత. ఇపుడు అది సరిగ్గా జగన్ కి మార్చుకుంటే సరిపోతుంది. ఏపీలో పాతిక మంది మంత్రులతో ఇరవై నెలలుగా కొలువు తీరిన జగన్ వారితోనే నిజమైనా నిష్టూరమైనా కూడా నెట్టుకువస్తున్నారు. దాదాపుగా అర్ధ భాగం పాలనకు దగ్గర పడుతున్నా శాఖ మీద పట్టు ఉన్నదెవరికో ఇంకా తెలియదు. మరికొందరు ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఉన్నాయన్న విమర్శలూ ఉన్నాయి.ఏడాది స్థానిక ఎన్నికల వేళ జగన్ కచ్చితంగా చెప్పేశారు. జిల్లాలలో తొంబై శాతం పైగా విజయాలు నమోదు కావాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. లేకపోతే మాత్రం మంత్రి పదవులు ఎవరికీ ఉండవు అంటూ అల్టిమేటం ఇచ్చేశారు. దాంతో గత మార్చిలో అంతా కలసి పరుగులు తీశారు. దాంతో బాగానే ఊపు వచ్చేసింది. తీరా టీడీపీకి పట్టు జారుతోంది అన్న కంగారు అలా ఉండగానే ఒక్కసారిగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. తిరిగి ఇపుడు జరుగుతున్నాయి, దాంతో మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వేళకు ఎవరి ఖాతాలో ఎన్ని విజయాలు పడ్డాయన్నదే గీటురాయిగా జగన్ తీసుకుంటారు అంటున్నారు.ఇదిలా ఉంటే కొన్ని జిల్లాలకు ఇద్దరేసి మంత్రులు కూడా ఉన్నారు. ఆయా జిల్లాలో బాగా పనిచేసే వారు ఎవరు, అసమర్ధులు ఎవరు అన్నది ఎవరు అన్నది కూడా సులువుగా తేలిపోతుంది అంటున్నారు. ఇప్పటికే జగన్ వద్ద మంత్రుల పని తీరు మీద స్థానిక ఎన్నికల ఫలితాలను కూడా కలుపుకుని బేరీజు వేస్తారని అంటున్నారు. అపుడు పెద్ద ఎత్తున తీసివేతలే ఉంటాయని అంటున్నారు. చిత్తూరు లాంటి జిల్లాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారే భారమంతా మోస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలో సీనియర్ మంత్రిగా బొత్స సత్యనారాయణ తన తడాఖా చూపిస్తున్నారు అని చెబుతున్నారు.స్థానిక ఎన్నికల తరువాత జగన్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. తొలిసారిగా అధికారంలోకి వచ్చాక సామాజిక వర్గ సమీకరణలు, ఇతరత్రా హామీలు పనిచేసి కొందరికి చాన్స్ ఇచ్చారు. ఇపుడు మాత్రం అలా కాకుండా సమర్ధులతో మంత్రివర్గం ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నరు అంటున్నారు. అలాగే సామాజిక సమీకరణలు కూడా చూసుకుంటూనే నోరున్న వారికి, పని మంతులకు అవకాశం ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా కూడా చెబుతున్నారు. మొత్తానికి వైసీపీలో అసలైన పంచాయతీ స్థానిక ఎన్నికల తరువాత మొదలవుతుంది అంటున్నారు

Related Posts