YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

క్యాస్టింగ్ కౌచ్ పార్లమెంటు కూడా అతీతం కాదు! - రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

క్యాస్టింగ్ కౌచ్ పార్లమెంటు కూడా అతీతం కాదు! - రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే లేదని.... అన్ని చోట్లా ఉందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ రేణుక ఈ వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో పార్టమెంట్ అతీతమని భావించవద్దని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చేదు వాస్తమని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.సినీ పరిశ్రమలో ఎవరినీ రేప్ చేసి వదిలేయడం లేదని... వాడుకుని వదిలేయడం లేదని... క్యాస్టింగ్ కౌచ్ వల్ల కొందరికి జీవనోపాధి లభిస్తోందని సరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని రేపాయి. ఆ తర్వాత సరోజ్ ఖాన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. శ్రీరెడ్డి కూడా సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు.సినిమా ఇండస్ట్రీ వాడుకుని వదిలేయడం లేదు కదా.. ఎవరూ రేప్ చేసి వదిలేయడం లేదు కదా.. క్యాస్టింగ్ కౌచ్ వల్ల కొందరికి జీవనోపాధి కలుగుతుందని సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని రేప్‌తో పోల్చి ఆమె చేసిన కామెంట్స్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె క్షమాపణ చెప్పారు. శ్రీరెడ్డి కూడా సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను ఖండించింది. పార్లమెంట్ లేదా ఇతర పని ప్రాంతాల్లో వేధింపులు ఉండవన్న అభిప్రాయం సరికాదు అని ఆమె అన్నారు.

Related Posts