YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దుష్యంత్ చౌతాలా రాజీనామా తప్పదా

దుష్యంత్ చౌతాలా రాజీనామా తప్పదా

ఛండీఘడ్, ఫిబ్రవరి 26, 
హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలపై వత్తిడి పెరుగుతుంది. ఆయన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ ఊపందుకుంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దుష్యంత్ సింగ్ చౌతాలా రాజీనామా చేయాలంటూ హర్యానా వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ శివార్లలో రైతులు మూడు నెలలుగా కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాంటూ నిరసనను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
హర్యానాలో కొన్ని నెలల క్రితమే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయింది. ఇక్కడ బీజేపీ, జననాయక్ జనతా పార్టీ కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేజేపీకి చెందిన దుష్యంత్ చౌతాలాకు బీజేపీ ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. మంత్రి పదవుల కేటాయింపులోనే జేజేపీలో అసంతృప్తి తలెత్తింది. తొలినాళ్లలోనే పార్టీ ఉపాధ్యక్షుడు రామ్ కుమార్ గౌతమ్ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. దీని నుంచి కొంత బయటపడి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో రైతుల ఆందోళనలు జేజేపీని మళ్లీ మొదటి దశకు తీసుకువచ్చాయి.దుష్యంత్ చౌతాలా కీలకమైన మంత్రి పదవులను తమ వద్దనే పెట్టుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ప్రాధాన్యత లేని శాఖలను పార్టీలోని ఇతరులకు అప్పగించడం కూడా అప్పట్లో వివాదాస్పదమయింది. దుష్యంత్ చౌతాలా చిన్న వయసులోనే పార్టీని స్థాపించి హర్యానాలో తన సత్తాను చాటారు. బీజేపీకి మెజారిటీకి అవసరమైన స్థానాలు రాకపోవడంతో దుష్యంత్ చౌతాలాను ఆశ్రయించాల్సి వచ్చింది. తొలుత కాంగ్రెస్ కు మద్దతిస్తానని చెప్పిన దుష్యంత్ తర్వాత బీజేపీకి మద్దతిచ్చారు.ఇప్పుడు రైతులు దుష్యంత్ చౌతాలాపై రాజీనామా వత్తిడి పెరుగుతుంది. ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఇదే డిమాండ్ విన్పిస్తుంది. రైతుల ఆందోళన ఎక్కువగా పంజాబ్, హర్యానాలోనే ఉండటంతో ఆయనపై కూడా ప్రెజర్ పెరుగుతోంది. తాను రాజీనామాకు సిద్ధమేనని ఎప్పటికప్పుడు దుష్యంత్ చౌతాలా ప్రకటిస్తున్నారు. అవసరమైన సమయంలో రాజీనామా చేస్తానని చెబుతున్నారు. మరవైపు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ఎమ్మెల్యే అభయ్ చౌతాలా రైతులకు మద్దతుగా తన పదవికి రాజీనామా చేయడంతో దుష్యంత్ పై మరింత వత్తిడి పెరుగుతోంంది. మరి దుష్యంత్ ఏం చేస్తారో చూడాలి.

Related Posts