YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

గవర్నర్ కు కలిసిన టీపీసీసీ నేతలు వామన్ రావు హత్య ఘటపపై పిర్యాదు

గవర్నర్ కు కలిసిన టీపీసీసీ నేతలు వామన్ రావు హత్య ఘటపపై పిర్యాదు

హైదరాబాద్ ఫిబ్రవరి 26, 
పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.  శుక్రవారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందం రాజ్భవన్లో తమిళిసైను కలిసింది. బృందంలో ఎమ్యెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, ఎమ్యెల్సి జీవన్ రెడ్డి ఇతరులు వున్నారు.
న్యాయవాదుల హత్యలో తెరాస నేతల పాత్ర ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పట్టపగలు నడిరోడ్డుపైన న్యాయవాద దంపతులను దారుణంగా కత్తులతో పొడిచి చంపడం వెనుక ఎవరున్నారో తేల్చాలి అని కాంగ్రెస్ బృందం కోరింది.  ఈ హత్యల వెనుక టిఆర్ఎస్ నాయకుల హస్తం ఉన్నట్టు ప్రాథమిక సాక్షాలు, ఆధారాలు ఉన్నా పోలీసులు సరిగా స్పందించడం లేదని వారు  ఆందోళన వ్యక్తం చేసారు.  తమకు ప్రాణ హాని ఉందని పోలీస్ ఉన్నతాధికారులకు ముందుగానే పిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.  నిందితులు మాట్లాడిన ఫోన్ కాల్స్ లో వారికి అక్కడి పోలీసు ఉన్నతాధికారులకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తేటతెల్లం అయ్యిందని వారన్నారు.  సూపరీలు ఇచ్చి హత్యలకు ప్రణాళిక వేశారని, ఈ హత్యలు సమాజం తల దించుకునేలా ఉన్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయని కాంగ్రెస్ నేతలు  ఆరోపించారు.  ‘‘రాష్ట్ర చరిత్రలోనే అత్యంత కిరాతకమైన ఘటన. ఇందులో పోలీసుల పాత్ర ఉందని జనం నమ్ముతున్నారు. హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు.

Related Posts