YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఉద్యోగాల కల్పన పై హీటెక్కిన రాజకీయం

ఉద్యోగాల కల్పన పై హీటెక్కిన రాజకీయం

ఉద్యోగాల కల్పన పై హీటెక్కిన రాజకీయం
హైదరాబాద్ ఫిబ్రవరి 26, 
ఉద్యోగాల కల్పన పై తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో లక్షా32వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన ప్రకటన తప్పని నిరూపిస్తె చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.  ఆ సవాల్ స్వీకరించిన కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ మంత్రి చెప్పిన లెక్కలు తప్పని నిరూపించేందుకు సిద్ధమని అన్నారు. దాంతో పాటు గన్ పార్క్ వద్దకు చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. శుక్రవారం ఉదయం నిరుద్యోగులను వెంటబెట్టుకుని గన్ పార్క్ కు దాసోజు  చేరుకున్నారు.  దాసోజు మాట్లాడుతూ తెలంగాణ లో ఏ ఆకాంక్ష తో ఏర్పాటు చేసుకున్నామో అది నెరవేరలేదు. ఉద్యోగ నియిమాకాలపై మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారు. చర్చకు రావాలని కోరినా.. ఇప్పటి దాకా రాలేదు. మంత్రి కేటీఆర్ కోసం కుర్చీ, దండ తీసుకొచ్చాం. కానీ ఇప్పటి వరకు చర్చకు రాలేదు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారమే 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ లో కాంట్రాక్టు పదమే ఉండదని కేసీఆర్ చెప్పారు.. ఈ రోజు జరుగుతున్నదేంటి. ఈ రోజు తెలంగాణ లో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ రోజు 47 శాతం ఖాళీలు ఉన్నాయి. 1200 మంది బలిదానం చేస్తే.. వచ్చిన తెలంగాణ లో అధికారం అనుభవిస్తున్నారు. అధికార మధంతో ఇష్టానుసారంగా టు.ఆర్.ఎస్ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 10వేల ఉద్యోగ భర్తీ జరగలేదనడానికి సిగ్గు లేదా. కిరణ్ హయాంలో 1.15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. కాంగ్రెస్ హయాంలో మూడు సార్లు డీఎస్సీ వేశాం... ఏడేళ్లలో ఒక్కసారి డీఎస్సీ వేశావా.. ఉద్యోగాలు ఇవ్వకుండా కుర్చీలో కూర్చోవడానికి నీ అయ్య జాగీరా అనుకున్నావా. నిరుద్యోగులు ఏం పాపం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకుతున్నారని అయన విమర్శించారు.

Related Posts