న్యూఢిల్లీ ఫిబ్రవరి 26 ఇరాన్‌లో మృతదేహానికి ఉరిశిక్ష అమలు చేశారు.ఉరిశిక్ష పడిన ఓ మహిళ గుండెపోటుతో చనిపోగా రజాయ్ షెహర్ జైలు అధికారులు ఆమెను నిబందలన ప్రకారం ఉరి తీసారు.. వివరాల్లోకి వెళ్తే.. ఇరాన్‌కు చెందిన జహ్రా ఇస్మాయిలీ అనే మహిళకు భర్తను చంపిన కేసులో నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష పడింది. ఈ నెల 23న అమెతోపాటు ఉరిశిక్షపడిన చాలామందికి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండటంతో అధికారులు అప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 23న ఉదయం నుంచి దోషులు ఒక్కొక్కరిని ఉరితీయడం మొదలుపెట్టారు. జహ్రా ఇస్మాయిలీ కంటే ముందు మొత్తం 16 మందిని ఉరితీశారు. వారంతా విలవిల్లాడుతూ ప్రాణాలు విడువడం కళ్లారా చూసిన జహ్రా భయంతో వణికిపోయింది. తీరా ఆమెను ఉరితీసేందుకు వేదికపై ఎక్కించగానే గుండెపోటు వచ్చి కుప్పకూలింది. అక్కడే ఉన్న వైద్యులు పరిశీలించి ఆమె మృతిచెందినట్లు ధృవీకరించారు. అయినా, అధికారులు విడిచిపెట్టకుండా ఆమె శవానికి ఉరిశిక్ష అమలుచేశారు. ఉరిశిక్షకు కొన్ని క్షణాల ముందు ఖైదీ మరణిస్తే ఏం చేయాలనే విషయంలో కచ్చితమైన నిబంధన ఏదీ లేకపోవడంతో ఉన్న నిబంధన ప్రకారమే ఆమె శవానికి ఉరితీశారు. తన కుమారుడిని చంపిందన్న కసితో ఉన్న అత్త కూడా కనికరం చూపలేదు. జహ్రా కూర్చుని ఉన్న కుర్చీని తన్నేసి ఉరిశిక్ష అమలు చేసింది. ఇరాన్‌లో ఉరిశిక్ష పడిన దోషులను ఉరితీసేటప్పుడు ఆ ఉరిశిక్‌ీల అమలును చూసేందుకు బాధితుల కుటుంబసభ్యులకు అనుమతి ఇస్తారు. ఉరికంబం వద్ద దోషులకు మెడకు ఉరితాడు వేసిన తర్వాత వారు కూర్చున్న కుర్చీని తన్నేసి ఉరిశిక్షను పూర్తిచేసే హక్కు బాధితుల కుటుంబానికి ఉంటుంది. తమకు న్యాయం జరిగిందన్న భావన కలుగడంతోపాటు, తమ చేతులతోనే దోషిని చంపేశామన్న తృప్తి బాధితులకు లభిస్తుందన్న ఉద్దేశంతో ఇరాన్‌తో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.