YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ స్పష్టం చేయాలి

ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ స్పష్టం చేయాలి

హైదరాబాద్ ఫిబ్రవరి 26 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది నిరుద్యోగులు. ఇంటికో ఉద్యమ వస్తుందని నిరుద్యోగులను ఆశపెట్టి తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించింది కేసీఆర్. ఏడు సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ స్పష్టం చేయాలి. పబ్లిక్ కమిషన్ సర్వీస్ చైర్మన్ ఏమో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారు, కేటీఆర్ మాత్రం లక్ష ముపై వేలు కు ఇచ్చాము అని చెప్తున్నారని బీజేపీ నేత డీకే ఆరుణ అన్నారు.  చక్రపాణి సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నాడా లేక కేటీఆర్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గా ఉన్నాడా...? కేటీఆర్ వాస్తవాలు చెప్పకుండా జూట మాటలు మాట్లాడుతున్నారు. సింగరేణిలో 12 వేల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెప్తున్నారు. కారుణ్య నియామకాల కింద మాత్రమె సింగరేణి లో ఉద్యోగాలు భర్తీ అయ్యాయి తప్ప ప్రత్యక్ష నియామకాలు చేపట్టలేదని అన్నారు.  కాంట్రాక్ట్ బేసిస్ అనే పదం తెలంగాణలో ఉండదు అని అన్న కేసీఆర్ నేడు ఎలా కాంట్రాక్టు బేసిస్ మీద ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. తెలంగాణ లక్ష్యాన్ని కేసీఆర్ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. గ్రామీణ స్థాయిలో పాఠశాలలో టీచర్లు లేరు.. అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా అందుతుంది. బోధనేతర బోధనేతర ఉద్యోగాలు 10 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని అన్నారు.  లక్ష ముప్లై రెండు వేల ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో షాడో ముఖ్యమంత్రి చెప్పాలి. 40 వేల మంది ప్రభుత్వం ఉద్యోగులు పదవి విరమణ చేస్తే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు. కేవలం తెలంగాణ యువతను మోసం చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెక్కల 24 లక్షల యాభై వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో నిరుద్యోగం పెరగడానికి కారణం కేసీఆర్. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఎందుకు మీనా మేశాలు లేక్కిస్తున్నారో కేసీఆర్ చెప్పాలి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వనికి బుద్ధి చెప్పాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. 

Related Posts