YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

త్తూరులో ప్లాస్టిక్ గుడ్ల కలకలం

త్తూరులో ప్లాస్టిక్ గుడ్ల కలకలం

చిత్తురు జిల్లాలో ప్లాస్టిక్ గుడ్లు కలకలం రేపుతున్నాయి. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం వోడేరు అంగన్ వాడీ కేంద్రంలో ప్లాస్టిక్ గుడ్లు ప్రత్యక్షమవ్వడంతో తల్లిదండ్రలు భయాందోళలకు గురైయ్యారు..పిల్లలు ఆరోగ్యంతో చెలగాటం అడుతున్నారు అంటూ తల్లిదండ్రులు,స్ధానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..అంగన్ వాడీ కేంద్రం నుంచి తెచ్చుకున్న గుడ్లు ప్లాస్టిక్ గుడ్లు అని తెలియడంతో స్ధానికలు ఆశ్యర్యానికి గురైయ్యారు. ప్రభుత్వమే ఇలాంటి గుడ్లును పంపిస్తే ఎలా అని తల్లిదండ్రులు ప్రశ్నింస్తున్నారు. ప్లాస్టిక్ గుడ్లు వల్ల పిల్లల ఆరోగ్యం ఏమైతుందోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుడ్లును పిల్లల ఎలా జీర్ణం చేసుకోగలరు, ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గుడ్లును ఉడకపెట్టిన తరువాత పగలకుండా అలానే బాల్ లాగా చాలా గట్టిగా ఉంటున్నాయి. అంగన్ వాడీ అధికారులను అడిగితే ..మీరు టైమ్ కి వచ్చి గుడ్లు తీసుకోకపోవడం వల్లే పాడవుతున్నాయని చెప్పారు..ఈ ప్లాస్టిక్ గుడ్లు వల్ల పిల్లల ఆరోగ్యం నెమ్మదిగా పాడవుతుందని , పిల్లల వీటిని త్వరగా జీర్ణించుకోలేరని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల పిల్లల జ్ఞాపక శక్తి కూడా తగ్గే ప్రమాదముందని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఎదుగుదలకు ప్లాస్టిక్ గుడ్లు ఆటంకం కలిగిస్తాయని డాక్టర్లు తెలిపారు.

Related Posts