YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

ఫీజుల అడ్డగోలకు అడ్డెప్పుడు

ఫీజుల అడ్డగోలకు అడ్డెప్పుడు

ఫీజుల అడ్డగోలకు అడ్డెప్పుడు
హైదరాబాద్, ఫిబ్రవరి 27, 
ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులను ఎలా కట్టడి చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. ఫీజుల భారంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదువులకే రూ.లక్షల ఫీజు వసూలు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఫీజులకు అదనంగా డొనేషన్లు గుంజుతున్నాయి. పిల్లలను ఇంగ్లీష్‌ మాధ్యమంలో కాన్వెంట్లలో చదివించడం తల్లిదండ్రులకు మరీ భారంగా మారింది. ఇక ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రుల గోస చెప్పనక్కర్లేదు. ఫీజుల భారం నుంచి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనికోసం పారదర్శకమైన విధానాన్ని అనుసరించాలని ఆలోచిస్తున్నది. అధిక ఫీజులను కట్టడి చేయడం, అర్హులైన ఉపాధ్యాయులతో బోధన సాగించడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియ మించిన ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అందులో పొందుపరిచిన సిఫారసులను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులతో దీనిపై విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు, పలు జిల్లాల డీఈవోలు, యాజమాన్యాలు, తల్లిదండ్రులతో త్వరలో చర్చలు జరిపే అవకాశాలు లేకపోలేదు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారం భమయ్యేలోగా ఫీజులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో 11 వేల ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటిలో సుమారు 2 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2017, మార్చిలో తిరుపతిరావు కమిటీని నియమించింది. 52 పేజీలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి 2018లో ఆ కమిటీ సమర్పించింది. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జాగ్రత్తలతో పలు సిఫారసులు చేసింది. లాభాపేక్ష లేకుండా పాఠశాలలను నడపాలని కోరింది. ఫీజుల వివరాలు, ఆడిట్‌ నివేదికలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలనీ, ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించింది. జోనల్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (జెడ్‌ఎఫ్‌ఆర్సీ)ని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం ఉన్న ఫీజులకు అదనంగా పది శాతం ఫీజులను యాజమాన్యాలు పెంచుకోవచ్చని సూచించింది. అయితే ప్రతి రూపాయికి లెక్క చూపాలని ఆదేశించింది. పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారాలు వంటివి చెప్పిన చోటే కొనాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయొద్దని వివరించింది. అర్హులైన వారినే ఉపాధ్యాయులుగా నియ మించాలని కోరింది. డొనేషన్‌, క్యాపిటేషన్‌ ఫీజు వసూలు చేయొద్దనీ, చేరినప్పుడే అడ్మిషన్‌ ఫీజు తీసుకోవాలని సూచించింది. తీసుకునే ప్రతి రూపాయికీ రశీదు ఉండాలని తెలిపింది. వసూలైన ఫీజులను ఇతర సంస్థలకు మళ్లించొద్దని వివరించింది. యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే మొదటి నేరంకింద రూ.5 లక్షలు, రెండోనేరం కింద రూ.10 లక్షలు జరిమానా విధించాలని ఆదేశించింది. అయినా తప్పులు కొనసాగితే మూడోనేరం కింద ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన సిఫారసులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు దానిపై మళ్లీ దృష్టి సారించడం గమనార్హం. అయితే ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని తెలంగాణ తల్లిదండ్రులు సంఘం, పలు విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.తెలంగాణ ఆవిర్భవిస్తే కార్పొరేట్‌ విద్యావ్యవస్థను నియంత్రిస్తామని నాటి ఉద్యమ నాయకుడు, నేటి సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో ప్రకటించారు. తెలంగాణ వచ్చి ఆరేండ్లు దాటింది. కార్పొరేట్‌ విద్యారంగాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రోత్సహించే చర్యలు చేపట్టింది తప్ప ఎక్కడా నియంత్రించలేదు. ఫీజుల నియంత్రణకు జిల్లా ఫీ రెగ్యులేటరీ కమిటీ (డీఎఫ్‌ఆర్‌సీ)ని ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్‌ 91ని 2009, ఆగస్టు 6న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై తల్లిదండ్రులు, కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో రూ.12 వేలలోపు ఫీజు ఉన్న పాఠశాలలు డీఎఫ్‌ఆర్‌సీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని జీవో నెంబర్‌ 91ని సడలింపునిస్తూ జీవో 3ని జారీ చేసింది. ప్రయివేటు పాఠశాలలు ఫీజు నియంత్రించాలనీ, క్యాపిటేషన్‌ ఫీజు రద్దు చేయాలనీ, కనీస ఫీజులు వసూలు చేయాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్‌ 42ను 2010, జూలై 30న విడుదల చేసింది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఆ జీవోను హైకోర్టు కొట్టివేసింది. అధిక ఫీజులు తగ్గించాలని రాష్ట్రంలో 2016, 2017లో పెద్దఎత్తున ఉద్యమాలొ చ్చాయి. తల్లిదండ్రులూ ఆందోళనలు చేశారు.స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిరావు నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీని వేసింది. నివేదిక ఇచ్చినా, సిఫారసుల అమలును సర్కారు మరిచిపోయింది. పాఠశాలల్లో ఎంత ఫీజులు వసూలు చేయాలో ఇప్పటికీ నిర్దిష్టమైన మార్గదర్శ కాల్లేవు. జీవో నెంబర్‌ ఒకటి ప్రకారం ప్రతి పాఠశాలలోనూ గవర్నింగ్‌ బాడీ ఉండాలి. ప్రయివేటు విద్యాసంస్థలు 5 శాతం మాత్రమే లాభాలు పొందాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ప్రకారం విద్యా వ్యాపారీకరణ, కార్పొరేటీకరణకు గురవుతున్నది. దీంతో ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఫీజులను కట్టడి చేయ డంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు 

Related Posts