కాణిపాకం ఆలయ అభివృద్దికి 30 కోట్లు
దేవాదాయ శాఖ కమిషనర్ పి అర్జున్ రావు
కాణిపాకం ఫిబ్రవరి 27,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తూ 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపడు తున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ పి అర్జున్ రావు తెలిపారు. దేవాదాయ శాఖ కమీసనర్ అర్జున్ రావు కుటుం బ సమేతంగా వరసిద్ధి కాణిపాకం వినాయక స్వామి వారిని దర్శించుకు న్నారు.ఈ సందర్భంగా ఆలయ ఇఓ వెంకటేష్ వారికి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా భక్తుల సౌకర్యాలకు ఎలాంటి ప్రతిపాదనలు పంపిన వెంటనే అనుమతులు ఇస్తామని కమిషనర్ వివరించారు.
కాణిపాక ఆలయ అభివృద్ధికి తయారుచేసిన మాస్టర్ ప్లాన్ ను త్వరలోనే అమలు చేసేందుకు ఆలయం పరిసరాలను కమిషనర్ పరిశీలించారు ఆ తర్వాత పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు తో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు ఈ సందర్భంగా కాణిపాకంలో 50 పడకల ఆసుపత్రి , వేద పాఠశాల అవసరమని కమిషనర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు వీటికి 15 రోజుల్లో ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేస్తామని ఎమ్మెల్యేకు కమిషనర్ హామీ ఇచ్చారు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున్ రావు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మాట్లాడుతూ కాణిపాకం ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉద్యానవన పార్కు లను తీసుకొస్తామన్నారు , అదేవిధంగా కళ్యాణ మండపం తో పాటు అదనంగా వంద గదుల విశ్రాంతి భవనం ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, మోహన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.