ఘనంగా అంతర్వేది గ్రామేత్సవం
రాజోలు ఫిబ్రవరి 27,
మాఘ పౌర్ణమి సందర్భంగా అంతర్వేది సముద్ర తీరం భక్తజన సందోహంతో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు సముద్ర స్నానాలు ఆచరించేందుకు ఎగబడ్డారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిమండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాలలో భాగంగా గరుడ పుష్పక వాహనపై శ్రీ స్వామివారి గ్రామేత్సవం శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. శ్రీస్వామివారి చక్రవారి మఘపౌర్ణమి సముద్రస్నానం ఆలయ ప్రధానఅర్చకులు శ్రీనివాసకిరణా ఆచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అప్పటివరకూ స్నానమాచరించకుండా వేచిఉన్న భక్తులు ఒక్కసారిగా స్వామి వారితో కలిసి స్నానమాచరించేందుకు ఎగబడ్డారు. ప్రజలు భక్తపారవశ్యంతో సముద్రస్నానాలు ఆచరించారు. సముద్రంతీరమంతా భక్తులతో నిండి గోవింద నామస్మరణతో మారుమ్రేగిపోయింది. తెల్లవారుజము నుంచే భక్తులు సముద్రస్నానాలాచరించిన అనంతరం స్వామివారి దర్శనానికి పోటీ పడటంతో రాజోలు సిఐ. దుర్గా శేఖర్ రెడ్డి అధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు..