కరోనా వ్యాక్సినేషన్
విజయనగరం ఫిబ్రవరి 27
విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసుశాఖలో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కోవిడ్ వేక్సినేషను కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిధిగా హాజరయ్యా రు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మాట్లాడుతూ కరోనా పై ఫ్రంట్ లైను వారియర్స్ గా పోరాటం చేసిన పోలీసు ఉద్యోగులకు కోవిషీల్డ్ వేక్సిన్ ను వేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఎఆర్ ఆఫీసు దగ్గర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా వేక్సినేషను వేయించేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. ఎన్నో వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత ప్రభుత్వం కోవిల్డ్ వేక్సిన్ ఫ్రంట్ లైను వారియర్స్ కు వేసేందుకు చర్యలు చేపట్టిందని, ఈ అవకాశాన్ని ప్రతీ పోలీసు ఉద్యోగి సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేక్సినేషనుకు ముందు ఎన్నో పరీక్షలు నిర్వహించి, కోవిడ్ 19 వైరస్ పై బాగా పని చేస్తుందని నిర్ధారించిన తరువాతనే వేక్సినేషను ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందన్నారు. వేక్సినేషను పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటేనే వేక్సినేషనుకు దూరంగా ఉండాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే వైద్యుల సలహాలను పొందాలన్నారు. వేక్సినేషను తరువాత ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినా వైద్యుల సహాయం పొందాలన్నారు. ఎటువంటి అపోహలు లేకుండా పోలీసు ఉద్యోగులు వేక్సినేష ను వేయించుకొని ప్రజల్లో ఉన్న ఆందోళలను దూరం చేసి, ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పిలుపు నిచ్చారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వేక్సిన్ వేసుకున్నా మరో 45 రోజులు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరుచూ సానిటైజేశన్ చేసుకోవాలన్నారు.