ముప్పై ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న ప్రజల సమస్యలను పట్టించుకోలేదు. అధికారులు, స్థానిక కార్పొరేటర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా.. సమస్యను పరిష్కరించలేదు.. కానీ.. ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ కోసం రాత్రికి రాత్రే రోడ్డు వేశారు. గత ముప్పైఏళ్లుగా రోడ్డు వేయాలని కోరుతన్నా.. పట్టించుకోని అధికారులు.. రాత్రికిరాత్రి రోడ్డు వేయడంతో అధికారుల తీరుపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక్కడ కనిపిస్తున్నది డీమార్ట్ షాపింగ్ మాల్. సబ్బు నుంచి చీర వరకు.. షాట్ నుంచి షర్ట్ వరకు అన్నీ కారుచౌకంటూ నెల్లూరులోని మాగుంట లేవుట్ సమీపంలో ఈ మధ్యే ఏర్పాటు చేశారు. నగర వాసుల నుంచి కొద్దో గొప్పో స్పందన వస్తుంది అనుకోండి.. అది వేరే విషయం.. అసలు మేటర్ లోకి వస్తే కొద్ది నెలల క్రితమే ఏర్పాటు చేసిన డీమార్ట్ కి అందమైన తారురోడ్డును ఏర్పాటు చేశారు కార్పొరేషన్ అధికారులు..
ఈ డీమార్ట్ షాపింగ్ మాల్ 21వ డివిజన్ లో ఏర్పాటు చేశారు.. ఇక్కడ నివసించే ప్రజలకు 30 ఏళ్ల నుంచి సరైన రోడ్డులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వర్షకాలమైతే కార్లు, బైక్‌లో ఇంటికి వెళ్లలేక నెట్టుకుంటే తీసుకెళ్ల్సాల్సిన పరిస్థితి. అయితే ఎన్నిసార్లు అధికారులను, స్థానిక కార్పోరేటర్ ను సంప్రదించినా.. పట్టించుకున్న దాఖల్లాలేవు.. ఒకటి కాదు రెండు కాదు.. 30 ఏళ్ల నుంచి ఇక్కడి ప్రజలకు మట్టి రోడ్డే గతైంది.. ప్రదాన రోడ్డు నుంచి ఈ డీమార్ట్ షాపింగ్ మాల్ కు ఉండే రోడ్డు కూడా మట్టిరోడ్డు కావడంతో కార్పొరేషణ్ అధికారులు ఆగమేఘాల మీద రోడ్డు వేస్తున్నారు.. డీమార్ట్ షాపింగ్ మాల్ నిర్వాహకులకు, కార్పొరేషన్ అధికారుల మధ్య ఏ అండర్ స్టాండిగ్ కుదిరిందో తెలియదు కానీ.. తెల్లారే సరికి రోడ్డు దర్శనమిచ్చింది. కాసులిస్తే చాలు.. పది నిమిషాల్లో పని పూర్తి చేస్తారనే ట్రాక్ రికార్డు నెల్లూరు కార్పోరేషన్ అధికారులకుంది.. షాపింగ్ మాల్ కావడం, కాసులు బాగానే చేతులు మారడంతోనే ఆఘమేఘాల మీద రోడ్డేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.. అదే... వార్డులో ఉండే ప్రజల సమస్యల కేకలు వినిపించని కార్పోరేషన్ అధికారులకు వాణిజ్య సంస్థల ఆమ్యామ్యాలు మాత్రం బాగా కనిపిస్తున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.