YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నాలుగు నెలలుగా మల్లిశాల గ్రామంలో నీటి ఎద్దడి

నాలుగు నెలలుగా మల్లిశాల గ్రామంలో నీటి ఎద్దడి

నాలుగు నెలలుగా మల్లిశాల గ్రామంలో నీటి ఎద్దడి
గుంతలో నీరే ఆధార మయ్యింది ఆకు మురుగు చెత్త నీరె గతి
రంపచోడవరం ఫిబ్రవరి 27,
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధి మన్యంలో లోతట్టు గిరిజన ప్రాంతాల్లో మొదలైన నీటి కష్టాలు.మారేడుమిల్లి మండలంలోని కుండాడ పంచాయతీ మల్లిసాల గ్రామంలో గత నాలుగు నెలలుగా నీటి ఎద్దడి నెలకొన్నది.  గ్రామంలోని గ్రామస్తులు గత నాలుగు నెలల నుండి గ్రామ శివారులో ఒక గుంత త్రవ్వుకొని దానిలో నుండి వచ్చే చెలమ నీటినే త్రాగుతున్నారు.వీరి బాధను పట్టిచుకున్న అధికారులు లేరని వారు ఆవేదన చెందుతున్నారు. ఇ నీటిని త్రాగుట వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని దగ్గు జలుబు జ్వరం వంటి రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. రానున్నది వేసవికాలం కావడంతో మాకు నీరు కరువై పోతుందని ఆవేదన చెందుతున్నారు. ఈనీటి గుంత చుట్టుపక్కల ఎటువంటి కంచె లేక పోవడంతో పశువులకు మనసు లకు ఇనీరే ఆధార మయ్యిందని తమ గోడు వెళ్ళబుచ్చు కుంటున్నారు. మాఊరికి కూస్త వేటు దూరంలో సచివాలయం ఉందని అలాంటిది వారికి మా సమస్యా  కనిపించక పోవడం విడ్డురంగా ఉందని,సమస్యా ఉంటే వెంటనే పరిష్కరించాల్సిన సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని జగన్న చెప్పేదొకటి వీరు చేసే పనులు వత్యసంగా ఉన్నాయని సచివాలయ సిబ్బంది ని సమస్యలు పరిష్కార మార్గం చేస్తారని నియమిస్తే  తమకేమీ పట్టనట్లు వ్యవహరించే శైలి విడ్డురంగా ఉందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.గతంలో ఇలాంటి సమస్యే వచ్చినప్పుడు అధికారులు ఎంతో కాలానికి స్పందించి వర్ష కాల సమయంలో  వాటర్ పంపింగ్ చేసే మోటర్ను ఏర్పాటు చేశారని అది కూడా తూతూ మంత్రంగా ఏర్పాటు చేయడం వలన ఐదు నెలలుగా పని చేసి తరువాత పని చేయకుండా పోయిందని చెబుతున్నారు. తరువాత అధికారి వారికి ఎన్ని సార్లు మొర పెట్టుకున్న మా మొర వినే నాధుడు లేడని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి మా గ్రామానికి వాటర్ సదుపాయాన్ని కల్పించాలని వారు కోరుతున్నారు

Related Posts