YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాడ్ తో కొట్టాడు...రాజయ్యాడు

రాడ్ తో కొట్టాడు...రాజయ్యాడు

రాడ్ తో కొట్టాడు...రాజయ్యాడు
గుంటూరు, మార్చి 1,
తురగా కిషోర్.. ఈ పేరు గుర్తుంది కాదా? ఫొటో చూస్తే గుర్తుపట్టే ఉంటారు. కొద్ది రోజుల క్రితం మాచర్ల వచ్చిన టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్నల వాహనంపై తురగా కిషోర్ రాడ్ తో దాడి చేశారు. మాచర్లలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన వీరిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులే దగ్గరుండి బుద్దా వెంకన్న, బోండా ఉమలను మాచర్ల నుంచి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. దీంతో తురగా కిషోర్ పేరు మారుమోగిపోయింది.తురగా కిషోర్ వైసీపీ కార్యకర్త. అంతకంటే ముఖ్యంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడు. వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. అమరావతి రైతులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై అప్పట్లో దాడి చేశారు. ఆ దాడి వెనక రైతుల కంటే టీడీపీ నేతలు ఉన్నారని వైసీపీ నేతల అనుమానం. అందుకు ప్రతిగానే మాచర్ల వచ్చిన టీడీపీ నేతలపై తురగా కిషోర్ దాడికి దిగారని అప్పట్లో ప్రచారం జరిగింది.అయితే ఇప్పుడు తురగా కిషోర్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే. ఆయనే మాచర్లకు కాబోయే మున్సిపల్ ఛైర్మన్. అవును తురగా కిషోర్ పేరును పార్టీ అధిష్టానం ఛైర్మన్ గా ఖరారు చేసింది. ఇప్పటికే మాచర్లలో వార్డులన్నీ దాదాపు ఏకగ్రీవం కావడంతో తురగా కిషోర్ మాచర్లకు ప్రధమ పౌరుడు కానున్నారు. మాచర్ల మున్సిపాలిటలో మొత్తం 31 వార్డులుంటే ఏడాది క్రితం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో 60 మంది వరకూ నామినేషన్లు వేశారు.అయితే మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. దీంతో నామినేషన్లు వేసిన వారు వైసీపీ వారే కావడంతో వారంతా ఉపసంహరించుకుంటారు. దీంతో దాదాపు వార్డులన్నీ ఏకగ్రీవమవుతాయి. వారంతా వైసీపీ మద్దతు దారులు, డమ్మీ అభ్యర్థులే కావడంతో మాచర్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం అవుతుంది. దీంతో తురగా కిషోర్ మున్సిపల్ ఛైర్మన్ గా బాధ్యతలను చేపట్టే రోజు ఎంతో దూరం లేదు. ఒక్క రాడ్ తురగా కిషోర్ జీవితాన్నే మార్చేసిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Related Posts