జూ పార్క్ లో సఫారీలు
హైదరాబాద్, మార్చి 1,
సందర్శకులకు సరికొత్త అనుభూతులను అందించడానికి నెహ్రూ జూలోజికల్ పార్కు అధికారులు కృషి చేస్తున్నా రు. జూ పార్క్ ఏర్పడినప్పటి నుం చి సఫారీ ఎన్‌క్లోజర్ టూర్‌కు ఎనలేని క్రేజీ ఉంది. సఫారీ టూర్ అనగానే సందర్శకుల్లో సంతోషాలకు హద్దులేకుండా పోతుంది. ఆనందాలతో కళ్లు ఎప్పుడెప్పుడా.. అంటూ ఆతృతగా ఎదురు చూస్తుంటాయి. అడువుల్లో స్వేచ్ఛగా తిరిగే మృగాలు మన కళ్ల ముందు కనిపించేట్లు సఫారీలో ఓపెన్‌గా తిరుగుతుంటా యి. సఫారీలో పులి గాండ్రింపులతో మనల్ని పలకరించే సమయాల్లోనో, సింహాలను, పులులను ప్రత్యక్షంగా చూస్తూ గొప్ప అనుభూతికి గురవు తాం. జూ పార్క్ సందర్శనలో సఫారీకి ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ ఎన్నో రోజులు అనుభూతులను నెమర వేసుకుంటాం. ప్రస్తుతం, సందర్శకులకు మరింతగా, సరికొత్తగా ప్రత్యేక అనుభూతిని కలిగించేందుకు జూ పార్క్ అధికారులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. సఫారీని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. సఫారీలో ప్రయాణించడానికి సిద్ధమయ్యే సం దర్శకులు అంతర్భాగంలో ఏయే జంతువులను చూడొచ్చో వారికి తెలుసుకునే విధంగా సఫారీ పార్క్ వద్ద కొత్తగా జంతువుల ఆర్టిస్టిక్ ఫైబర్, కాం క్రీట్ బొమ్మలను ఏర్పాటు చేస్తున్నాం. సఫారీ గోడలపై జూ పార్క్‌లో ఏయే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ జంతువులను చూశామో మరోసారి జ్ఞప్తికి వచ్చేట్లు అందంగా డిజైన్లను తయారు చేస్తున్నామని జూపా ర్కు క్యూరేటర్ సుభద్రాదేవి తెలిపారు. జూను ఎప్పుడు సందర్శించినా కొత్తదనం, జంతు సంరక్షణపై మమకారంతో మళ్లీ మళ్లీ జూని సందర్శించాలనిపిస్తోందని సరోజ్‌దేవి కుటుంబ సభ్యులు తెలిపారు. సరోజ్‌దేవి కుటుంబ సభ్యులు జూలో కొలువైన 121 ఏళ్ల తాబేళ్ల జతను ఏడాది పాటు దత్తత తీసుకోవడానికి శనివారం ముందు కు వచ్చినట్టు తెలిపారు. జూ అధికారి క్షితిజా మాట్లాడు తూ జూలో పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్నామని తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.