నేవీ అధికారిగా అజేంద్ర బహదూర్ సింగ్ బాధ్యతలు స్వీకరణ
విశాఖపట్నం మార్చి 1,
తూర్పు నౌకాదళం ఎలాంటి సవాళ్ల కైనా సిద్ధంగా ఉందని తూర్పు నౌకా దళాధిపతిగా నూతన బాధ్యతలు చేపట్టిన వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ అన్నారు.విశాఖలోని ఐఎన్ఎస్ సర్కార్స్ మైదానంలో బాధ్యతల స్వీకరించారు. బదిలీపై దిల్లీకి వెళుతున్న ఎ.కె.జైన్ నుంచి ఎ.బి.సింగ్ ఈ బాధ్యతలు తీసుకు న్నారు. ఈ సందర్భంగా ఎ.కె.జైన్ నౌకాదళ వివిధ యూనిట్ల నుంచి వీడ్కోలు వందనాన్ని స్వీకరించారు. పరేడ్‌ను నూతన తూర్పు నౌకద ళాధిపతి వైస్ అడ్మిరల్ ఎ.బి.సింగ్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎ.బి.సింగ్ మాట్లాడుతూ దేశ భద్రత పరిరక్షణలో నౌకాదళ పాత్ర తిరుగు లేనిదన్నారు. పాక్‌పై సాధించిన విజయానికి 50 వసంతాలు పూర్త య్యాయని వివరించారు. ఆపరేషన్ పవన్ శ్రీలంకలో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. సామర్థ్యాలు, పోరాట పాటవాలను నవీకరించుకుంటున్నామన్నారు. మన సముద్ర తీరాన్ని, జలాలను రక్షించుకునే విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని వివరించారు. సముద్రతీరంలో ఉన్న జిల్లాల యంత్రాంగాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో విశాఖ తూర్పు నౌకాదళం సమన్వయం చేసుకుంటుందని నూతన తూర్పు నౌకాదళాధిపతి స్పష్టం చేశారు.