న్యూఢిల్లీ మార్చ్ 1
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు. ‘ఎయిమ్స్‌లో కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు వేగంగా చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. అర్హులైన ప్రతి ఒక్కరు కొవిడ్ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మనమంతా సమష్టి కృషితో భారత్‌ను కరోనా రహిత దేశంగా మారుద్దాం’ అని అన్నారు. దేశీయంగా తయారైన భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను ప్రధాని వేయించుకున్నారు. ఎయిమ్స్ సిస్టర్ పీ. నివేదా ప్రధానికి సిరంజీ ద్వారా టీకా ఇచ్చారు.