YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

సమ్మర్ లో పడిపోతున్న నీటి మట్టాలు

సమ్మర్ లో పడిపోతున్న నీటి మట్టాలు
వేసవి కాలం రావడంతో రాష్ట్రంలోని జలాశాయాల్లో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టాయి.  నీటి ప్రాజెక్టులతో పాటు చెరువుల పరిస్థితీ అంతే....ఇప్పుడే ఇలా వుంటే ఇంకా రెండు నెలల వేసవిలో జలాశయాలు పూర్తిగా అడుగట్టుకుపోయో ప్రమాదం ఉంది.  మంచినీరు, సాగునీరు పరిస్థితి ఏమటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం, 24 గంటల వ్యవసాయ కరెంటు, రబీసాగు, త్రాగునీరు వంటి కారణాల వల్ల జలాశాయాల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోతుంది. రాష్ట్రంలోని నిజాంసాగర్, శ్రీ రాంసాగర్ ప్రాజెక్టులు మాత్రమే నిలకడగా ఉన్నాయి.ఎగువ మానేరు, సాత్నాలా ప్రాజెక్టులు డెడె స్టోరేజీకి చేరుకున్నాయి.వేసవి కాలం వచ్చిందంటే చాలు జలాశయాల్లో నీటి మట్టాలు కనిష్ట స్ధాయికి చేరుకుంటాయి. గత 15 రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువడంతో ప్రాజెక్టులోని నీరు ఆవిరైపోతోంది. గ్రామాల్లోని చెరువుల గురించి మరి చెప్పనవసరం లేదు. అవి పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఇదిలావుంటే త్రాగునీరు సమస్య కూడా మరింత తీవ్రతరం అవుతోంది. రబీ సీజన్ మొదలయిన సందర్భంగా సాగునీరు లేక చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం రబీ సీజన్ లో ఆరువేల ఎకరాలు సాగవ్వగా , ఈ ఏడాది ఒక్క ఎకరాకూ నీరు అందని పరిస్థితి తలెత్తింది.కరీంనగర్ ఎగువ, మద్య, దిగువ మానేరు ప్రాజెక్టులో ఎగువ మానేరు ఈ ఏడాది సాగు నీటిని అందివ్వలేకపోయింది.2.2 టిఎంసీల సామర్థ్యం ఉన్న మానేరు కింద 13,085 ఎకరాలు సాగవ్వాల్సింది ఇప్పుడు 0.16 టిఎంసీలే ఉండడంతో  ఒక్క ఎకరా కూడా సాగవ్వలేదు.అలాగే లోయర్ మానేరు ప్రాజెక్టు సంగతి అంతే... 24 టిఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్ మానేరు ఇప్పుడు 3.914 టిఎంసీలు మాత్రమే కలిగివుంది. అదేవిధంగా ఈ జిల్లాలోని గర్రెవల్లి ప్రధాన జలాశయం కూడా 1500 ల ఎకరాలకు గానూ కేవలం 700 ల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందివ్వగల్గింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి.... నీటి ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీ కి చెరుకోవడంతో జిల్లాలో త్రాగునీటి సమస్య మరింత ఎక్కువైంది. సింగూరు ప్రాజెక్ట్ లో సైతం రోజు రోజుకీ నీటిమట్టాలు తగ్గు ముఖం పడుతున్నాయి.ఉమ్మడి పాలమూరు జిల్లాకు నీరందించే జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో లేకపోవడంతో నీరులేక అడుగంటిపోయింది.ప్రస్తుతం జూరాల లో కేవలం 3.260 టిఎంసీ నీరు మాత్రమే ఉంది. దీంతో మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, ఆత్మకూరు వంటి ప్రాంతాలు త్రాగునీటి సమస్యతో అల్లాడుతున్నాయి. కర్నాటక నుంచి 1 లేదా 2 టిఎంసీల నీరు తెస్తే తాగునీటిని అందించే ఆస్కారం ఉంటుందని జూరాల ప్రాజెక్టు అదికారులు చెబుతున్నారు. అలాగే సాథ్‌నాలా ప్రాజెక్టు పరిస్థితి అంతే ......286 అడుగులు నీటిమట్టం ఉండాల్సింది కేవలం 1.5 అడుగుల లోతు మాత్రమే కల్గివుంది.కడం, స్వర్ణ, సుద్ధవాగు, మత్తడివాగుల ప్రాజెక్టుల సైతం కనిష్ట మట్టానికి చేరుకున్నాయి.అలాగే నిజామాబాద్ ,కామారెడ్డి జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిస్ధాయి లో  నీరు లేకపోయినా గతేడాది కంటే మెరుగ్గానే ఉందని చెప్పాలి. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 3.096 టిఎంసీల నీటి నిల్వ ఉంది. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాల్వాల ద్వారా నీటి విడుదలను ఆపివేయండంతో ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉంది. హైదరాబాద్ కు త్రాగునీటిని అందిస్తున్న ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ జంటజలాశాయాలు ముందుజాగ్రత్తగా నిల్వ చేస్తున్నారు.అయితే వేసవి ఎండల తీవ్రతకు నీరుచాలావరకు ఆవిరైపోయి నీటి మట్టాలు తగ్గుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Related Posts