YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్తున్న ఆటో డ్రైవర్ కి భారీ జరిమానా

పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్తున్న ఆటో డ్రైవర్ కి భారీ జరిమానా

పెద్దపల్లి
రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై నాగరాజు తన సిబ్బంది తో కలిసి సింగిరెడ్డిపల్లి గ్రామం దగ్గర లోని 11 ఇంక్లైన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆటో ని అపి తనిఖీ చేయగా ఆటో డ్రైవర్ అందులో 10 మంది ప్రయాణికులను అదనంగా తీసుకువెల్లుచున్నాడు. ఎస్సై నాగరాజు ఆటో నుండి ప్రయాణికులను కిందకు దింపి వారికి పరిమితికి మించి ప్రయాణం చేయడం ఎంతటి ప్రమాదకరమో వివరించారు. కొంచెం ఆలస్యం అయినప్పటికీ సురక్షితమైన ప్రయాణం చేయాలని సూచించారు. ప్రమాదకరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులతో వెల్లుచున్నట్లయితే డ్రైవర్ కి ఆటో పై అదుపు ఉండదని ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే మీ కుటుంబం అంధకారం లోకి వెళ్తుందని అని తెలిపారు. కావున భవిష్యత్తు లో పరిమితికి మించి ప్రయాణాలు చేయమని వారితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రమాదకరమైన స్థితిలో అదనపు ప్రయాణికులను తీసుకువెళ్తున్న ఆటో డ్రైవర్ కి రూ.3200 జరిమానా విధించారు. ఎస్సై నాగరాజు ఆర్టీసీ బస్సు ఆపి, ప్రయాణానికి సరిపడా డబ్బులు ఇచ్చి ప్రయాణికులను బస్సు లో పంపారు. ఎస్సై సేవా దృక్పథాన్ని సీఐ ప్రవీణ్ కుమార్ స్థానికులు  అభినందించారు.

Related Posts