న్యూఢిల్లీ మార్చ్ 1
సుప్రీంకోర్టు జడ్జిలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మంసగళవారం నుంచి ప్రారంభించనున్నారు. అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్‌లలో నుంచి ఏదో ఒకదానికి ఎంపిక చేసుకునే అవకాశం జడ్జిలకే కల్పించారు. సుప్రీంకోర్టు జడ్జిలకే కాకుండా వాళ్ల కుటుంబ సభ్యులు, రిటైర్డ్ జడ్జిలకు కూడా వ్యాక్సిన్లు వేయనున్నారు. సుప్రీంకోర్టు ఆవరణలోనే రిజిస్ట్రీ ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ వసతి కల్పించింది. ఇక్కడ లేదంటే ప్రభుత్వ జాబితాలో ఉన్న ఏ ఆసుపత్రిలో అయినా జడ్జిలు, వాళ్ల కుటుంబ సభ్యులు వ్యాక్సిన్లు వేసుకోవచ్చు.