YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎన్‌డీఏ అంటే (ఎన్‌-నో, డీ-డేటా, ఏ-అవైల‌బుల్‌): కేటీఆర్

ఎన్‌డీఏ అంటే (ఎన్‌-నో, డీ-డేటా, ఏ-అవైల‌బుల్‌): కేటీఆర్

హైద‌రాబాద్‌ మార్చ్ 1
తెలంగాణ‌లో విద్య‌, ఉద్యోగాల‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా అంటూ బీజేపీ ఎమ్మెల్సీ రామ‌చంద‌ర్‌రావు విసిరిన స‌వాలుకు మంత్రి కేటీఆర్ దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ గేటు బ‌య‌ట సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల క‌ల్లా వ‌స్తాను.. మీరూ రండి.. చ‌ర్చిద్దాం అంటూ ఆదివారం రామ‌చంద‌ర్‌రావు ట్వీట్ చేశారు. దీనిపై సోమ‌వారం ట్విట‌ర్‌లో కేటీఆర్ స్పందించారు. గౌర‌వ‌నీయులైన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గారు ఇస్తాన‌న్న 12 కోట్ల ఉద్యోగాలు (ఏడాదికి 2 కోట్లు), జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో వేస్తాన‌న్న రూ.15 ల‌క్ష‌ల స‌మాచారం సేక‌రించ‌డంలో నేను బిజీగా ఉన్నాను. కానీ ఇప్పటివ‌ర‌కు స‌మాధానం మాత్రం ఎన్‌డీఏ (ఎన్‌-నో, డీ-డేటా, ఏ-అవైల‌బుల్‌)నే. మీ ద‌గ్గ‌ర ఏమైనా స‌మాధానం ఉంటే షేర్ చేయండి అంటూ కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చారు.
 

Related Posts