YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎయిర్ పోర్టులో..నాడు జగన్..నేడు చంద్రబాబు

ఎయిర్ పోర్టులో..నాడు జగన్..నేడు చంద్రబాబు

అమరావతి
రేణిగుంట ఎయిర్పోపర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలీసులు నిర్భందించిన వ్యవహారం పరిశీలిస్తే.. గతంలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్‍ రెడ్డి చేసిన హడావిడి గుర్తుకు వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పట్లో ప్రతిపక్ష నేత జగన్‍ రెడ్డిని నిర్బందించినప్పుడు రాబయే రోజులలో కాబోయే ముఖ్యమంత్రిని. నన్ను నిర్భందించిన వారందరినీ గుర్తు పెట్టుకుంటాను. ప్రజలకోసం ఎన్ని అవమానాలు.. ఎన్నెన్నో నిర్భందలను ఎదుర్కొనే సహనం నాకుంది అని అప్పట్లో జగన్‍ రెడ్డి పోలీసులపై చిందులు వేశారు.తాజాగా ఎయిర్‍ పోర్టులో చంద్రబాబును నిర్భందించటంతో ఆయన పోలీసులపై ఏ విధంగా ఆవేశ పడ్డారంటే.. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాను. గతంలో పదేళ్లు ప్రతిపక్ష నేతగా కూడా బాధ్యతలు నిర్వహించాను. గత రెండేళ్ల నుండి ప్రతిపక్ష నేతగా ఉన్నాను. అకారణంగా నన్ను ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‍, ఎస్పీలతో మాట్లాడతానని చెప్పినా.. ఒక అడుగు కూడాచంద్రబాబును ముందుకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుపడ్డారు.ఆనాడు జగన్‍ రెడ్డి ఆవిధంగా.. ఈనాడు చంద్రబాబు ఈ విధంగా.. నిరసనలు వ్యక్తం చేయటం రాజకీయ చర్చానీయాంశంగా మారింది. గతంలో జగన్‍ రెడ్డి పోలీసు అధికారులపై ఎలా చిందులు తొక్కారో.. తాజాగా చంద్రబాబు కూడా పోలీసు అధికారులపై చిందులు తొక్కుతూ ఆవేశంగా నిలదీశారు.

Related Posts