YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

ఖమ్మం జిల్లాల్లో తాగు నీటి కష్టాలు

ఖమ్మం జిల్లాల్లో తాగు నీటి కష్టాలు
 ఖమ్మం  జిల్లాలో తాగునీటి కష్టాలు అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అర్భాటాల మధ్య పనులు మొదలుపెట్టినా.. వాటిని పూర్తి చేయడంలో అధికారులు విపలమవుతున్నారు. ఫలితంగా గ్రామస్థులు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి.. సమస్యను పరిష్కరించాలని సారిపాక గ్రామస్థులు కోరుతున్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామాన్ని తాగునీరు సమస్య వేధిస్తోంది. సమస్య పరిష్కారం కోసం స్థానికులు ప్రభుత్వ యంత్రంగానికి విన్నవించింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌మిట్రింగ్‌సిస్టమ్‌ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు 9కోట్ల రూపాయల నిధులతో ప్రణాళికలు రూపొందించింది. వెంటనే ఆచరణలో పెట్టిన అప్పటి ప్రభుత్వం.. పనులు కూడా ప్రారంభించింది. దాదాపు 50వేల జానాభా ఉన్న ఈ గ్రామంలో.. మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు అధికారులు ఇంటింటికీ పైప్‌లైన్‌ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి నల్లా మీటర్‌తో అంతర్గత పైప్ లైన్ పనులకు, నీటినిలువ ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పనులు నత్తనడకన కొనసాగడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు మొదలై మూడేళ్లు గడుస్తున్నా.. ఇంటింటికీ కనెక్షన్‌ ఇవ్వడం మాత్రం ముందుకు సాగలేదు. గత నాలుగు నెలలుగా ట్రయల్‌రన్‌ చేస్తున్నామని.. వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేసి తాగునీరు సరఫారా చేస్తామని చెపుతున్నా అది ఆచరణ సాధ్యం కావడం లేదు. మరోవైపు తాగునీరు పైపులకు సంబంధించిన పనులను ఐటీసీ పేపర్ కర్మాగార యాజమాన్యం, జలమండలి సంయుక్తంగా చేస్తున్నారు. వీరిరువురి మధ్య సయోధ్య కుదరక పోవడం వల్లే నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్న విమర్శలు లేకపోలేదు. ఇదిలాఉంటే.. ఐటీసీ కర్మాగారం పుణ్యమా అని.. రోజురోజుకు పదుల సంఖ్యలో వలసలు వెళ్తున్నారు. అదేసమయంలో పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి సారపాక వచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగుతోంది.  సారపాకలో ఒక్కసారిగా జనాభా పెరగడంతో నీటి కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఇప్పటికే తాగునీరు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు సుదూర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి సారపాక గ్రామస్తులకు త్రాగునీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు.  

Related Posts