YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటెల, కేసీఆర్ మధ్య గ్యాప్..

ఈటెల, కేసీఆర్ మధ్య గ్యాప్..

కరీంనగర్, మార్చి 2, 
కొన్ని కొన్ని బంధాలు అనుబంధాలు మామూలుగా ఉండ‌వు. రాజ‌కీయ బంధాలు కూడా అలాంటివే. అంత‌కు మించి అనేలా న‌డుస్తుంట‌య్. త‌ర్వాత మాత్రం బిస్కెట్ అవుతుంట‌య్. ఇప్పుడు సీఎం కేసీఆర్.. మినిస్ట‌ర్ ఈటెల రాజేంద‌ర్ ల మ‌ధ్య ఫ్రెండ్షిప్ కూడా అలాంటిదే అంటున్నారు జ‌నాలు. యాక్చువ‌ల్ గా అయితే.. వీరిద్ద‌రి స్నేహం ఈనాటిది కాదు. రాజ‌కీయం స్నేహం కాస్తా.. అంత‌కు మించి అనేలా సాగింది. కానీ.. ఎన్నాళ్ల‌ని అలాగే ఉంటుంది చెప్పండి. ఎంత ఘాటు ప్రేమ అయినా బ్రేక‌ప్ లు ఉంటాయి అంటారు క‌దా. ఈ రాజ‌కీయ అనబంధానికి కూడా ఇక‌పై బ్రేక్ ప‌డ్డ‌ట్లే అనే మాట పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో ఫుల్ గా వినిపిస్తోంది.ఈటెల రాజేంద‌ర్ అంటే.. సీఎం కేసీఆర్ ఈ మ‌ధ్య చాలా సీరియ‌స్ గా ఉన్నార‌ట‌. ఆయ‌న్ని క‌ల‌వను కూడా క‌ల‌వ‌డం లేద‌ట‌. మినిస్ట్రీ ఉన్నా.. ఈటెల మినిస్ట్రీలో ఆయ‌న మాట న‌డ‌వ‌డం లేద‌ట‌. అంతా పై వారే చూసుకుంటున్నార‌ని టాక్ న‌డుస్తోంది. లేదంటే.. అధికారులే ఫైన‌ల్ డెసిష‌న్ తీసుకుంటున్నారు అని వినిపిస్తోంది. మొన్నీ మ‌ధ్య‌.. అదే జిల్లా నుంచి గంగుల క‌మ‌లాక‌ర్ కి రెస్పాన్సిబులిటీస్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఈటెల‌ని మాత్రం లైట్ తీసుకున్నారు. మినిస్ట్రీలో కూడా ఆయ‌న మాట చెల్ల‌క‌పోవ‌డంతో.. ఈటెల అస‌లు హైద‌రాబాద్ ని వ‌దిలి.. క‌రీంన‌గ‌ర్ వెళ్లిపోయార‌ని తెలుస్తోంది. అధికారుల‌కి కూడా అందుబాటులోకి రావ‌డం లేద‌ట‌.. వారు కూడా ఆయ‌న్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. టీఆర్ఎస్ లీడ‌ర్ల‌కి కూడా ఈటెల పెద్ద‌గా అందుబాటులో లేర‌ట‌.ఈటెల, కేసీఆర్ మ‌ధ్య ఈ గ్యాప్ రావ‌డానికి చాలా రీజ‌న్సే ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఆ మ‌ధ్య‌.. గులాబీ జెండాకు తామే అస‌లైన వార‌సులం అన్నారు ఈటెల రాజేంద‌ర్. త‌ర్వాత కూడా కొన్ని కొన్ని విష‌యాల్లో ఇద్ద‌రికీ విభేదాలు వ‌చ్చాయ‌ట‌. ఆ మ‌ధ్య ఈటెల సొంతంగా పార్టీ పెడుతున్నారు అనే టాక్ వినిపించింది. అలాగే కేటీఆర్ ని సీఎం ని చేయాలి అనే విష‌యంపై కూడా.. ఈటెల మాట‌, కేసీఆర్ మాట యాంటీగా ఉన్నాయ‌ట‌. రీసెంట్ గా కేటీఆర్ సీఎం అన్న వారిని ఎంత సీరియ‌స్ గా తీసుకున్నారో తెలిసిందే క‌దా. ఆ మాట అన్న‌ది ఈటెలేన‌ని అంద‌రికీ తెలిసిందే క‌దా. ఇలా గ్యాప్ త‌ర్వాత గ్యాప్ వ‌స్తూ.. క‌రీంన‌గ‌ర్ కి ప్ర‌గ‌తి భ‌వ‌న్ కి ఉన్నంత గ్యాప్ రావ‌డంతో.. ఈటెల ఇప్పుడు క‌రీంన‌గ‌ర్ వెళ్లార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ గ్యాప్ ని సెట్ చేసే లీడ‌ర్ ఎవ‌రూ అనేది.. టీఆర్ఎస్ లో కూడా ఎవ‌రికీ క్లారిటీ లేదు. మ‌రి ఈటెల గ్యాప్ తీసుకుంటే.. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో ఎదిగిన ఎమ్మెల్యేలు లీడ‌ర్లు.. ఎటు సైడ్ తీసుకుంటారు అనేది కూడా ఇంట్ర‌స్టింగ్ గా మారింది.

Related Posts