కడప మార్చి 2,
చమురు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని సిఐటి యు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా చిట్వేలు మండలం సిఐటియు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచినందుకు నిరసనగా వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతుతూ పెంచిన ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ధరల పెంపులో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడుతోంద న్నారు.