న్యూఢిల్లీ మార్చ్ 2 దేశంలో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 16వేల వరకు నమోదైన పాజిటివ్ కేసులు 12వేల లోపు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,24,527కు పెరిగింది. తాజాగా 12,464 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,07,98,921 మంది కోలుకున్నారు. మరో 91 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1,57,248 చేరింది. ప్రస్తుతం దేశంలో 1,57,248 క్రియాశీల కేసులున్నాయని కేంద్రం చెప్పింది. టీకా డ్రైవ్లో భాగంగా 1,48,54,136 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వివరించింది.