ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ మీడియాపై యుద్ధం ప్రకటించారు. తనను, తన తల్లిని నడి రోడ్డుపై మీడియా సమక్షంలో నటి శ్రీరెడ్డి అనకూడని మాటలు అంటుంటే.. కొన్ని ఛానల్స్ వాటిని పదే పదే ప్రసారం చేయడాన్ని నిరసిస్తూ ఆయా ఛానల్స్‌ని నిషేదించాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. అయితే తనను, తన తల్లిని దూషించిన శ్రీరెడ్డిపై మాత్రం ఎక్కడా దూషణలు కాని.. విమర్శలు కాని చేయలేదు. ఆమెను పావులా వాడుకుంటా వెనుకుండి నడిపిస్తున్న వారిపైనే తన అస్త్రాలను సంధిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ వివాదమంతటికీ ప్రధాన కారణమైన శ్రీరెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్‌పైన, ఆయన కుటుంబంపైన విమర్శలు గుప్పిస్తూనే ఉంది. నిన్న మెగాస్టార్ చిరంజీవి గురించి సంచలన కామెంట్స్ చేస్తూ.. సుదీర్ఘ వ్యాసంలో ఆయన కులంపైన, కుటుంబ సభ్యులపైన, అభిమానులపైన, రాజకీయ ప్రస్థానం పైన సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆమె పక్కా స్క్రిప్ట్‌తో రాజకీయ శక్తుల అండదండలతో అడుగులు వేస్తుందనేది నిన్నటి ఫేస్ బుక్ పోస్ట్‌ని బట్టి బహిర్గతం అయ్యింది. ఆమె వ్యాసంలో రాసుకొచ్చిన విషయాలు ఎవరో రాజకీయపండితుడి కలం నుండి జాలు వారిని విమర్శనాస్త్రాలే తప్ప ఆమెకంత సీన్ లేదు అంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు. అయితే వారి వాదనను బలపరిచేలా మరో సంచలన పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. మంగళవారం నాడు తన స్థాయిని మరింత దిగజార్చుకుని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మానసిక రోగిగా అభివర్ణిస్తూ ఇన్ డైరెక్ట్‌గా విమర్శలు గుప్పించింది. తాజా పోస్ట్‌లో శ్రీరెడ్డి ఏమందంటే.. ఖఛ్చితంగా పీపీడీ (పారానాయిడ్ పర్సనాలిటీ డిసార్డర్) అనబడే ఒక మానసిక వ్యాధికి సంబంధించిన రోగ గ్రస్తుడు. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం ఆ మానసిక వ్యాధి లక్షణాలివి.
1) ఆధారాలేమి లేకుండా అనుమానాలు అపనమ్మకాలలో మునిగిపోవడం.
2) అనూన్యతా భావంతో చిన్న చిన్న విషయాలకి కూడా భరించలేని అవమానం ఫీల్ అవ్వడం.
3) తాను నమ్మే వాటి నిర్ధారణ కోసం తన కళ్ళకి మాత్రమే కనిపించే క్లూ లని ఊహించుకోవడం
4) లేని శత్రువుల నుంచి తనకేదో వాళ్ళనుంచి ప్రమాదం ఉందనుకునే భ్రమలో కూరుకుపోయి లేదని ప్రూవ్ చేసినా అర్ధమయ్యే శక్తి కోల్పోవడం.
5) మీనింగ్ ఫుల్ భావోద్వేగాల్ని కోల్పోవడం వల్ల అనబడే ఒంటరి తనం కోరుకునే ఇంకొక మెంటల్ ప్రాబ్లెమ్‌కి లోనవడం.
6) అకారణంగా పగల్ని ప్రతీకారాల్ని పెంచుకుని ఎవరేం చేసినా తనని తొలిగించటానికే ప్లాన్ చేస్తున్నారని అనుకోవడం.
ఈ పాయింట్లని స్టడీ చేసి,చేష్టల్ని కానీ,ట్వీట్లని కానీ పరిశీలిస్తే ఈ 6 పాయింట్లు కూడా మ్యాచ్ అవుతాయి.ఈ వ్యాధి ఉన్న మెంటల్ పేషెంట్లకు ట్రీట్మెంట్ చెయ్యకపోతే ముందు ముందు స్కీజోటైఫల్, స్కీజోయిడ్ అనబడే ఇంకో రెండు మెంటల్ వ్యాధులు కూడా రావటానికి అవకాశముంది. కానీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ముందు వ్యాధిగ్రస్థుడినని ఒప్పుకోవాల్సిన అవసరముంది’ అంటూ ఇన్ డైరెక్ట్‌గా పోస్ట్ చేసింది శ్రీరెడ్ది.
అయితే ఆమె ఈ పోస్ట్‌లో ప్రస్తావించిన విషయాలకు, పవన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా ఛానళ్ల వాదనకు దగ్గరి పోలికలు ఉండటంతో శ్రీరెడ్డికి వాళ్ళ దగ్గరనుండే స్క్రిప్ట్ అందుతుందని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.