న్యూ ఢిల్లీ మార్చ్ 2 నైజీరియాలో అపహరణకు గురైన 317 మంది బాలికలను సాయుధులు రిలీజ్ చేసినట్లు జామ్‌ఫారా రాష్ట్ర గవర్నర్ ఇవాళ వెల్లడించారు. జంగేబీ గవర్నమెంట్ గర్ల్స్ సైన్స్ సెకండరీ స్కూల్‌లో ఉన్న 317 మంది విద్యార్థినులను గత శుక్రవారం అపహరించారు. అయితే ఎంత మంది బాలికలు రిలీజయ్యారన్న సంఖ్యను గవర్నర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నలేదు. ముస్లిం బుర్కాలు వేసుకుని బాలికలు తిరిగి స్కూల్‌కు వచ్చిన వీడియోలను రిలీజ్ చేశారు. ప్రభుత్వ బిల్డింగ్‌లో కూర్చున్న వందల మంది విద్యార్థినులను ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. ఉత్తర నైజీరియాలోని సాయుధ దళాలు ఇటీవల విద్యార్థుల అపహరణకు పాల్పడుతున్నారు. జిహాదీ గ్రూపు బోకో హరామ్‌తో కలిసి ఈ చర్‌కు దిగుతున్నారు.