ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి లంచం డిమాండ్ చేస్తూ ఏపీవో, పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నిర్మల్ రూరల్ మండలం అనంతపేట గ్రామ శివారులో శ్రీనివాస్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్లాట్ల అమ్మకానికి వెంచర్ వేశాడు. ఇందుకోసం అనుమతులు ఇవ్వడానికి ఎంపీవో శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ రోజు మధ్యాహ్నం నిర్మల్ రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో వ్యాపారి శ్రీనివాస్ రెడ్డి నుంచి రూ. 2.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.