YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

మూడు రోజుల్లో 33 మంది మృతి

మూడు రోజుల్లో 33 మంది మృతి
 దండకారణ్యాన్ని ఏలుతున్న నక్సల్స్‌కు గత 38 ఏళ్లలో ఎన్నడూ ఊహించిన ఎదరుదెబ్బ తగిలింది. మూడురోజుల్లో 33 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సరిహద్దుల్లో రెండో రోజులపాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో 33 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. వీరిలో అగ్రనేతలు కూడా ఉన్నారు.  నక్సల్స్‌తమ కార్యకలాపాలు సాగించడానికి బీడీ వ్యాపారుల నుంచి వసూలు చేసే డబ్బుపై ప్రధానంగా ఆధారపడుతుంటారు. అయితే డబ్బులు వసూలు చేసేందుకు గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్‌నాయకులు అడుగుపెట్టారన్న పక్కా సమాచారంతో పోలీసులు వ్యూహం రచించారు. అడవుల్లో 50 నుంచి 60 మంది వరకు నక్సల్స్‌సమావేశమయ్యారనే సమాచారంతో సి-సిక్స్టీ కమెండోలను రంగంలోకి దింపారు. మావోలు.. పోలీసులకు మధ్య జరిగిన పోరులో 16మంది మావోలు కుప్పకూలారు.. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే వారు అక్కడి నుంచి పారిపోవడంతో పోలీసులు కూంబింగ్‌నిర్వహించారు. తీవ్ర గాయాల పాలైన మావోలు కూడా మృతిచెందారు. తాజాగా ఇంద్రావతి నది నుంచి మరో 11 మంది మావోయిస్టుల డెడ్‌బాడీలు కొట్టుకొచ్చాయి. దీంతో ఒక్క గడ్చిరోలీ ఎన్‌కౌంటర్‌లో మావోలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 27 మంది మృతిచెందారు.  తాజాగా గడ్చిరోలిలో మళ్లీ తుపాకులు పేలాయి. పదహారుమంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌జరిగిన కొన్ని గంటలకే అహేరీ తాలూకా రాజారాం ఖన్లా అటవీప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు. ఈ విషయాన్ని ఎఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ధ్రువీకరించారు.  ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో కొంతమందిపై రివార్డులు కూడా ఉన్నాయి. మరోవైపు ఎన్‌కౌంటర్‌జరిగిన ప్రాంతంలో భారీగా మందుగుండు సామగ్రి, ఎస్‌ఎల్‌ఆర్‌, ఏకే47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ దళాలు, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. 

Related Posts