YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

తెరాస అభ్యర్దిని గెలిపించాలి మంత్రి హరీష్ రావు

తెరాస అభ్యర్దిని గెలిపించాలి మంత్రి హరీష్ రావు

తెరాస అభ్యర్దిని గెలిపించాలి
మంత్రి హరీష్ రావు
హైదరాబాద్  మార్చి 3, 
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ తెరాస అభ్యర్థి వాణి దేవి గెలుపు కోరుతూ రంగారెడ్డి జిల్లా తాండూరులోని ఆర్య వైశ్య భవన్ లో తెరాస సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో   ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, మంత్రి,  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి,  తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీ దేవి తదితరులు పాల్గోన్నారు. 
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ దేశంలో అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ వంద కోట్లతో ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ.  ఉద్యమంలో లాయర్ల పాత్ర అమోఘం. అడ్వకేట్ లకు కరోనా సమయంలో 25  కోట్ల సాయం అందించారు. దేశంలో ఏ రాష్ట్రం ఇలా ఇవ్వలేదు. రాంచందర్ రావు ఆరేళ్ల లో అడ్వకేట్లకు చేసిన సేవ ఏంటని ప్రశ్నించారు.  తెలంగాణ వల్ల తాండూరు రెవెన్యూ డివిజన్ గా, తాండూరు జిల్లా ఏర్పడింది. లాయర్లు తమ ఓటు వాణి దేవి కి వేయాలి. ఆర్ ఎంపీలు, పీఎంపీలు ఉద్యమంలో, అభివృద్ధి లో మాకు సహకారం అందించారు. వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకారం ఇవ్వాలి. కరోనా వల్ల అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఆరో తరగతి నుండి విద్యా సంస్థలు ప్రారంభించాం. లక్ష మంది పట్టభద్రులను తయారు చేసిన మంచి అభ్యర్థి వాణీ దేవి. తొలి ప్రాధాన్యత ఓటు వాణి దేవికే వేయాలి. జూనియర్ కాలేజి యాజమాన్యం ఉద్యమంలో ఉన్నారు. సహకరించాలి. రాంచందర్ రావు ఎమ్మెల్సీ గా  ఇష్టం లేదు. ఆయన ఎమ్మెల్యే గా, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. పట్టభద్రులకు సేవ చేయాలనుకుంటే ఎందుకు ఎమ్మెల్యే గా పోటీ చేశారు. 30 నెలల్లో మూడు సార్లు పోటీ చేసారు.  హ్యాట్రిక్ ఓటమి  ఖాయమని అన్నారు. బీజేపీ పెట్రోల్,డిజిటల్ ధరలు పొంచి ప్రజల నడ్డి విరిచింది. వారికి బుద్ధి చెప్పెలా వాణీ దేవికి ఓటు వేయండి. మహిళా అభ్యర్థి వాణీ దేవికి మహిళలంతా ఓటు వేయండని మంత్రి అన్నారు. 
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాఉతూ కరోనా వల్ల విద్యావ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపింది.  ప్రయివేటు సంస్థల ఇబ్బందుల ను దృష్టిలో ఉంచుకునే విద్యాలయాలు తెరవాలని సీఎం చెప్పారు. చిన్నచిన్న ప్రయివేటు విద్యా సంస్థలు పిల్లలకు విద్యతో పాటు ఉపాధికల్పించేవాటిగా సీఎం భావిస్తున్నారు. ఈ కారణంతో నే ప్రభుత్వం పాఠశాల వాహనాలకు ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన వాణీ దేవీకి ఓటు వేసి గెలిపిస్తే  మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మంత్రి అన్నారు.

Related Posts