YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పట్టణ ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే ధ్యేయంగా టీడీపీ మేనిఫెస్టో... భక్షక వైసీపీ నుండి ప్రజల రక్షణకు భరోసా - యనమల రామకృష్ణుడు

పట్టణ ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే ధ్యేయంగా టీడీపీ మేనిఫెస్టో... భక్షక వైసీపీ నుండి ప్రజల రక్షణకు భరోసా - యనమల రామకృష్ణుడు

పట్టణ ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే ధ్యేయంగా టీడీపీ మేనిఫెస్టో...
భక్షక వైసీపీ నుండి ప్రజల రక్షణకు భరోసా
- యనమల రామకృష్ణుడు
విజయవాడ మార్చి 3,
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి సంజీవనిలా తెలుగుదేశంపార్టీ మేనిఫెస్టో నిలుస్తుంది. జగన్ రెడ్డి, జే-గ్యాంగ్ భూదందాలను అరికట్టేందుకు, పట్టణ, నగర ప్రాంతాల్లో రౌడీయిజం, అకృత్యాలను అంతమొందించేం దుకు తెలుగుదేశంపార్టీ మేనిఫెస్టో కవచమై నిలబడుతుందని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. . పేదల సంక్షేమ కార్యక్రమాలు ఆటంకం లేకుండా కొనసాగించాలన్నా, వ్యాపారులు ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.           గడిచిన రెండేళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమరాలేదు, ప్రజలపై భారీగా పన్ను భారం, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను భారీగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. తెలుగుదేశం హయాంలో పట్టణ, నగర అభివృద్ధికి చర్యలు తీసుకుంటే, జగన్రెడ్డి హయాంలో తాడేపల్లి ప్యాలెస్ను సుందరీకరించుకున్నారు. సొంత ఆస్తుల విలువ పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ పట్టణాలపై లేదు. పట్టణాలను అభివృద్ధి చేసిందేమీ లేకపోయినా.. పట్టణాలు, నగరాల నుండి వసూలు చేసే పన్నుల్ని పెంచి దోచుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి ఓటేయడం ద్వారా పట్టణాలు అభివృద్ధి చేయడంతోపాటు రాష్ట్ర భవిష్యత్కు దోహదపడుతుందని అన్నారు.
మాఫియాలను నిర్మూలిస్తాం
ఇసుక, ల్యాండ్, శాండ్, సిమెంట్ మాఫియాలను తయారు చేసి పేద, మధ్య తరగతి ప్రజలను జగన్ రెడ్డి ప్రభుత్వం పీల్చి పిప్పి చేస్తోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి ప్రజలు సొంత ఇంటిని నిర్మించుకోవాలంటేనే భయపడే పరిస్థితిని కల్పించారు. ఈ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసి ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా తెలుగుదేశంపార్టీ మేనిఫెస్టో తీర్చిదిద్దడం జరిగింది.
పన్నులు తగ్గిస్తాం
జగన్ ప్రభుత్వం అప్పులు చేసేందుకు ఆస్తి పన్ను పెంచాడు. మరోసారి అవకాశం ఇస్తే జుట్టు పెంచుకోవాలన్నా, కొత్త చొక్కా వేసుకోవాలన్నా చివరికి రోడ్డుపై నడవాలన్నా కూడా పన్ను వేసే స్థితికి చేరుకుంటారు. ఇప్పటికే.. అప్పులు చేస్తే గానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ పథకాలు, చివరికి ముసలోళ్లకు ఇచ్చే పెన్షన్ కూడా అప్పు చేసే ఇస్తున్నారు. తెలుగుదేశంపార్టీ గెలుపొందిన కార్పొరేషన్, మున్సిపాలిటీలలో పన్నులు సగానికి తగ్గిస్తూ తొలి తీర్మానాన్ని చేస్తామని మేనిఫెస్టో సాక్షిగా ప్రకటిస్తున్నామని అన్నారు.
కార్మికులు ఆలోచించి ఓటేయండి
తెలుగుదేశం హయాంలో విజయవంతంగా అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించకుండా అవినీతి సంపాదన కోసం కృత్రిమ ఇసుక కొరతను సృష్టించి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను జగన్ రెడ్డి రోడ్డున పడేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను దారి మళ్లించారు. చంద్రన్న బీమా నిలిపేశారు. ఆకలి తీర్చాలన్న ఉద్దేశ్యంతో పెట్టిన అన్న క్యాంటీన్లను ఆదాయం లేదని మూసేశారు. ఉచిత ఇసుక విధానం మళ్లీ అమలవ్వాలన్నీ, సంక్షేమ నిధి కార్మికులకు అండగా నిలవాలన్నా.. 'సైకిల్' గుర్తుకు ఓటేయాలి. టీడీపీ జెండా ప్రతి మున్సిపాలిటీపై, కార్పొరేషన్పై రెపరెపలాడాలని అన్నారు.
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటే టీడీపీని గెలిపించాలి
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో దశాబ్దాలపాటు ఉద్యమించి తెచ్చుకున్న విశాఖ ఉక్కును తన కేసుల కోసం తాకట్టు పెట్టారు. ఎ-1, ఎ-2లు ఇద్దరూ కలిసి తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న విశాఖ స్టీల్ ను చీకటి ఒప్పందంతో అమ్మకానికి పెట్టి.. విలువైన స్టీల్ ప్లాంట్ భూముల్ని కూడా కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే విశాఖ ఉక్కుతోపాటు, ఆంధ్రప్రదేశ్ను కూడా అమ్మకానికి పెట్టడం ఖాయం. విశాఖలో జగన్ రెడ్డి అండ్ కో సెటిల్మెంట్లు, భూకబ్జాలకు అడ్డుకట్ట పడాలంటే తెలుగుదేశంపార్టీ అభ్యర్ధులు అఖండ మెజారిటీతో గెలవాలి. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే ఓటు అనే ఆయుధంతో జగన్రెడ్డికి ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్పాలని అన్నారు. 
 

Related Posts