న్యాయవాదుల హత్య కేసు సీబీఐకి అప్పగించాలి
హైదరాబాద్
న్యాయవాద దంపతులు వామన రావు, నాగమణి ల హత్య కేసుని ప్రభుత్వం సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ లీగల్ సెల్ అద్వర్యం లో న్యాయవాదుల సంతకాల సేకరణ చేసారు. దానిలో భాగంగా రంగారెడ్డి జిల్లా కోర్ట్ ల సముదాయం లో న్యాయవాదులు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది, మొదటి సంతకం ఎమ్ ఎల్ సి మరియు న్యాయవాది అయిన రామ్ చంద్రరావు చేయగా అనంతరం న్యాయవాదులు సంతకాలు చేశారు, ఈ సంతకాలని రేపు గవర్నర్ కి అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్ ఎల్ సి రామ్ చంద్ర రావు మాట్లాడుతూ నిన్న కేటీఆర్ తన విషయం లో మాట్లాడుతూ ఎమ్ చేసాడని ప్రశ్నించారన్నారు దానికి సమాధానం చెప్పిన రాం చంద్ర రావు నేను కౌన్సిల్ లో ఉండి న్యాయవాదుల సంక్షేమ నిది 100 కోట్లని బయటకి తీయటానికి ప్రశ్నించిన వ్యక్తిని నేను అని చెప్పుకొచ్చారు,
అదేవిదంగా న్యాయవాదులకి వారి కుటుంబ సభ్యులకి భద్రత లేకుండా పోయిందని ప్రభుత్వం కి వ్యతిరేకంగా కోర్ట్ లో ఏదైనా పిల్ వేస్తే చంపడానికి కూడా నాయకులు వెనకాడట్లేదన్నారు. ఇది ఒక కాంట్రాక్ట్ కిల్లింగ్,న్యాయవాద దంపతులు హత్య కేస్ లో వెనకాల ఉండి హత్య చేయించిన నిందితులని కూడా అరెస్ట్ చేయాలని, ప్రభుత్వం వారిని కాపాడుతుందన్నారు,ప్రభుత్వం మీద న్యాయవాదులకు నమ్మకం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేస్ ని పారదర్శకంగా చేయట్లేదని కాబట్టి ఈ కేస్ ని సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఈ సంతకాల సేకరణ చేయటం జరుగుతుందని అన్నారు..